అటుకుల కొబ్బరి లడ్డూ ఎలా తయారు చేస్తారు?

Webdunia
సోమవారం, 2 జూన్ 2014 (17:23 IST)
కావలసిన పదార్థాలు : 
అటుకులు - రెండు కప్పులు, 
పచ్చికొబ్బరి - ఒక చిప్ప, 
యాలకులు - చెంచా, 
బెల్లం - రెండు కప్పులు, 
కిస్‌మిస్ - రెండు టీస్పూన్లు, 
పాలు - అరకప్పు, 
జీడిపప్పు - టీస్పూన్, 
నెయ్యి - వేయించడానికి సరిపడ.
 
తయారు చేయు విధానం :
ముందుగా అటుకులను శుభ్రంగా ఏరి వాటిని మిక్సీలో వేసి కాస్త గరుకుగా పట్టుకోవాలి. తర్వాత కొబ్బరిని, బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. జీడిపప్పు, కిస్‌మిస్‌లను నెయ్యిలో దోరగా వేయించాలి. తర్వాత పాలను గిన్నెలో వేడిచేసి అందులో తురిమిపెట్టుకున్న బెల్లాన్ని వేసి కలపాలి. 
 
బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉంచి తర్వాత పాలను అటుకుల మిశ్రమంలో వేసి కలిపి వేడిగా ఉన్న సమయంలోనే లడ్డూలు చుట్టాలి. వీటిపై మెల్లగా జీడిపప్పు, కిస్‌మిస్‌లను అద్దాలి. అంతే కొబ్బరి లడ్డూ రెడీ. వేడిగా సర్వ్ చేయండి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెట్టుబడులు ఆకర్షించడంలో నవ్యాంధ్ర టాప్ : ఫోర్బ్స్ కథనం

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని అరెస్ట్ చేయవద్దు.. ఏపీ హైకోర్టు ఆదేశాలు

సోమనాథ్ ఆలయంలో అంబానీ దంపతుల పూజలు - రూ.5 కోట్ల విరాళం

నా అభిప్రాయాలు భార్యకు నచ్చవు : విదేశాంగ మంత్రి జైశంకర్

Nizamabad: నిజామాబాద్‌ను కమ్మేసిన పొగమంచు.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ వైజాగ్ కాదా?

Show comments