Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కైమా ఉండలు" ఎలా తయారు చేస్తారు?

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (13:24 IST)
కావలసిన పదార్థాలు :
కైమా.. అర కేజీ
నూనె.. ఒకటిన్నర కప్పు
ఉల్లిపాయలు.. ఐదు
వెల్లుల్లి.. ఆరు
కోడిగుడ్డు.. ఒకటి
అల్లంముక్క.. కాస్తంత
వేయించిన శనగపప్పు.. 4 టీ.
లవంగాలు.. 3
దాల్చిన చెక్క.. 3
యాలకులు.. 2
ధనియాలు.. 2 టీ.
పసుపు, ఉప్పు, కారం.. తగినంత
 
తయారీ విధానం :
కైమాను శుభ్రం చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లిని ముద్దగా నూరుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి ఉంచాలి. శెనగపప్పును పొడి చేసి ఉంచాలి. ఒక గిన్నె స్టవ్‌పై ఉంచి, అందులో కైమా, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలియబెట్టి నీళ్లు పోయకుండానే ఉడికించాలి.
 
కైమా బాగా ఉడికాక దించి, శెనగ పొడి వేయాలి. దాంట్లోనే కోడిగుడ్డు పగులగొట్టి బాగా కలిపి ఉంచి, మిశ్రమాన్ని కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు బాగా కాగుతున్న నూనెలో కైమా ఉండలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి రుచికరమైన కైమా ఉండలు సిద్దం.
 
ఈ కైమా ఉండలను ఆపరేషన్ చేయించుకున్నవారికి బలం వచ్చేందుకు తినిపిస్తుంటారు. రుచిగా ఉండటమేగాకుండా, శరీరానికి బలాన్నిచ్చే ఈ కైమా ఉండలను ఇష్టపడనివారుండరంటే అతిశయోక్తి కాదు. మీరూ ఓసారి ట్రైచేసి చూడండి మరి..!! 

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

Show comments