పోషకాల గని డ్రైఫ్రూట్స్ సమోసా

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (16:40 IST)
కావలసిన వస్తువులు :
 
మైదా పిండి - పావుకిలో
 
డాల్డా లేదా నెయ్యి - 50 గ్రాములు
 
కాజు, బాదం, కిస్‌మిస్, పిస్తా పప్పులు - అరకప్పు (అన్నీ కలిపి)
 
కోవా - అరకప్పు
 
ఏలకుల పొడి - అర టీ స్పూన్
 
లెమన్ పసుపు రంగు - మూడు చుక్కలు
 
చక్కెర - అరకేజీ 
 
నూనె - వేయించడానికి తగినంత
 
ఉప్పు - చిటికెడు
 
డ్రైఫ్రూట్స్ సమోసా తయారుచేయండి ఇలా : 
మొదట మైదా పిండిని జల్లించి, అందులో ఉప్పు, కరిగించిన డాల్డా, వాము వేసి బాగా కలపాలి. తరువాత అందులో తగినంత నీరు పోసి చపాతీ పిండిలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కోవానుపొడిగా చేయాలి. సన్నగా కట్ చేసుకున్న డ్పైఫ్రూట్స్, సగం ఏలకుల పొడి, కలర్ వేసి కలిపి పెట్టుకోవాలి. మరో వైపు చక్కెరలో పావు కప్పు నీళ్లు పోసి ముదురుపాకం చేసుకుని అందులో మిగిలిన ఏలకుల పొడి కలపాలి. ఇప్పుడు పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. చాకుతో రెండు భాగాలుగా కట్ చేసి, ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి చెంచాడు డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి సమోసాలా మడిచి వేడి నూనెలో బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. తరవాత వీటిని పంచదార పాకంలో వేసి అరగంట ఉంచి తీసివేయాలి. అంతే తియతియ్యటి డ్రైఫ్రూట్స్ సమోసా రెడీ. స్కూల్‌కు వెళ్లి అలసిపోయి వచ్చే పిల్లలకు ఈ డ్రైఫ్రూట్స్ సమోసా మంచి శక్తినిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తూత్తుకుడిలో 17ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య.. ఇంటికిరాని బిడ్డ కోసం వెతికితే?

చమురు సుడిగుండంలో ప్రపంచం, ఖమేనీ కుమారుడిని కూడా లేపేస్తానంటున్న యూఎస్?

Unseasonal rains : విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... అనేక జిల్లాల్లో భారీ వర్షాలు

హరీష్ రావు గుంటనక్క.. సరే.. జగన్, పవన్, లోకేష్‌లపై కల్వకుంట్ల కవిత ఏమన్నారు?

అనుకున్నదానికంటే ఎక్కువే చేశాం.. ఇరాన్‌పై యుద్ధానికి త్వరలోనే చరమగీతం.. ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Supirya: డెకాయిట్ లోని ట్యూన్ కు కోటి గారు ఫీల్ అవ్వడం కరెక్టే : సుప్రియ

Monalisa Bhosle: కేరళలో ప్రియుడిని పెళ్లాడిన మహా కుంభమేళా గర్ల్ మోనాలిసా (video)

Hansika: హన్సిక మోత్వానీ తన భర్త సోహైల్ కతూరియాతో విడిపోయింది

Kasarla Shyam: ఆయా షేర్ పాట తో లైఫ్ లాంగ్ సరిపోయే కిక్ ఇచ్చారన్నారు : కాసర్ల శ్యామ్

Tammareddy: ఇండస్ట్రీ లో మనుగడ లేదు అనుకున్న టైంలో వదలా చిత్రం చేశా : తమ్మారెడ్డి

Show comments