కరోనావైరస్, బీట్ రూట్‌ను అలా కాకుండా ఇలా తింటే బెస్ట్ (video)

Webdunia
బుధవారం, 8 జులై 2020 (22:33 IST)
అసలే కరోనావైరస్. ఇదివరకు క్యారెట్, బీట్రూట్ వంటివి తెస్తే జ్యూస్ చేసుకుని తీసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు పచ్చివి తీసుకుంటే ఏమవుతుందోనన్న భయం వెంటాడుతుంది. కనుక అలా తినడానికి భయపడేకంటే వాటిని చక్కగా హల్వాలా చేసుకుని తింటే సరి.

బీట్‌రూట్ కూరగా మాత్రమే కాకుండా హల్వాలాగా కూడా చేయటం వలన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచటానికి ఎంతగానో దోహదపడుతుంది. కనుక ఎక్కువుగా పిల్లలకు దీనిని పెట్టడం వలన రక్తహీనతను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు బీట్ రూట్‌తో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు...
బీట్ రూట్ తురుము-3 కప్పులు,
బొంబాయి రవ్వ- ముప్పావు కప్పు,
మంచి నీళ్లు- ఒకటిన్నర కప్పు,
నెయ్యి- 4 టేబుల్ స్పూన్లు,
పంచదార - 2 కప్పులు,
జీడిపప్పు- 2 టేబుల్ స్పూన్లు,
ఎండు ద్రాక్ష- 2 టేబుల్ స్పూన్లు,
బాదం-10,
యాలకుల పొడి-అరటీస్పూన్
 
తయారుచేసే విధానం....
బీట్‌రూట్ తొక్కు తీసి సన్నగా తురమాలి. పాన్‌లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, బొంబాయి రవ్వ వేసి సుమారు 5 నిమిషాలు వేయించి తీసి, ఆరనివ్వాలి. అదే పాన్‌లో మరో టీ స్పూన్ నెయ్యి వేసి సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుద్రాక్ష కూడా వేసి వేగాక అన్నీ తీసి ప్రక్కన ఉంచాలి. 
 
ఇప్పుడు అదే బాణలిలో మిగిలిన నెయ్యి, బీట్ రూట్ తురుము వేసి మధ్యస్థమైన మంట మీద బాగా కలపాలి. తరువాత మంచినీళ్లు, పంచదార వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూతపెట్టి మీడియం మంట మీద నీరంతా ఆవిరయ్యే వరకు ఉడికించాలి. తరువాత యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష అన్నీ వేసి కలిపి దించాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Donald Trump: పాకిస్థాన్ అదుర్స్.. మూడో ప్రపంచ యుద్ధం అలా ఆగింది..

భాగ్యనగరంలో దారుణం.. ట్రైనీ పైలెట్ విద్యార్థినిపై అత్యాచారం

మేనకోడలిపై అత్యాచారం... కొడుకుపై క్రిమినల్ కేసు పెట్టిన కన్నతల్లి

అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్: పాకిస్థాన్ సంధి- 14 రోజులు గడువు

విభూతి జలపాతంలో మునిగి పర్యాటకుడి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raaka: అల్లు అర్జున్ #AA22xA6 ఫస్ట్-లుక్ టైటిల్ ఇదే

Venkatesh: ఐదు సినిమాలు చేస్తే చాలనుకున్న నన్ను నిలబెట్టింది వారే : అడివి శేష్

Akhil: అఖిల్ అక్కినేని పుట్టినరోజున లెనిన్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

తర్వాతి కథనం
Show comments