Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ శుక్రవారం స్పెషల్.. బాదం హల్వా ఎలా చేయాలో ట్రై చేయండి!

బాదం పప్పుల్ని వేడినీళ్లలో గంటపాటు నానబెట్టాలి. పావు కప్పు పాలల్లో కుంకుమపువ్వు వేసి ఉంచాలి. నానిన బాదంలో పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. నీళ్లు లేకుండా ఉండేలా చూసుకొని మిక్సీలో రుబ్బుకోవాలి. దీంట్లో

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2016 (16:12 IST)
శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారానికి మహిమ ఎక్కువ. పంద్రాగస్టు, రాఖీ పౌర్ణమి అన్నీ వరుసబెట్టి రావడంతో ఈ పండుగ రోజున తీపి పదార్థాలు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వంటకాలు ట్రై చేయండి. ముందుగా బాదం హల్వా ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
బాదం : రెండు కప్పులు 
నెయ్యి : అర కప్పు 
కుంకుమ పువ్వు : కొద్దిగా
యాలకుల పొడి : అర టీ స్పూన్ 
పాలు : ఒక కప్పు 
 
తయారీ విధానం:
బాదం పప్పుల్ని వేడినీళ్లలో గంటపాటు నానబెట్టాలి. పావు కప్పు పాలల్లో కుంకుమపువ్వు వేసి ఉంచాలి. నానిన బాదంలో పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. నీళ్లు లేకుండా ఉండేలా చూసుకొని మిక్సీలో రుబ్బుకోవాలి. దీంట్లో కొద్దిగా పాలు పోసి గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో చక్కెర కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చక్కెర కరిగాక.. అందులో బాదం పప్పు పేస్ట్‌ని వేసి కలుపుతుండాలి. 
 
కాస్త చిక్కబడ్డాక నెయ్యి కొద్దికొద్దిగా వేసి కలపాలి. ఆపై కొద్దిగా బాదం పలుకుల్ని, యాలకుల పొడిని వేసి కలపాలి. కుంకుమపువ్వు పాలు పోసి ఐదు నిమిషాలు సన్నని మంట మీద ఉంచి దించాలి. ఇప్పుడు ప్లేట్‌కి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని పోయాలి. రుచికరమైన బాదం హల్వా రెడీ. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments