Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి సెలవుల్లో "జాగరీ రోటీ మకరంద్"తో మజా..!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి.. నాలుగు కప్పులు
బియ్యం పిండి.. రెండు కప్పులు
కొబ్బరి తురుము.. రెండు కప్పులు
సన్నటి రవ్వ.. ఒక కప్పు
యాలకుల పొడి.. రెండు టీ.
బెల్లం (జాగరీ).. ఒక కేజీ
గసగసాలు, తెల్ల నువ్వులు.. అర కప్పు చొప్పు

తయారీ విధానం :
ముందుగా బెల్లాన్ని మెత్తగా నలగ్గొట్టి, కాసిన్ని నీళ్లుపోసి కరిగించాలి. ఆ తరువాత గసగసాలు మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక పాత్రలో వేసి, బెల్లం కరిగించిన నీటిని పోస్తూ చపాతీ పిండిలాగా బాగా కలపాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసి పక్కనుంచాలి. ఒక్కో ఉండను తీసుకుని ముందుగా కాస్త వెడల్పుగా ఒత్తి, గసగసాల్లో అద్దాలి. దాన్నే మళ్లీ మందపాటి చపాతీలా ఇంకాస్త పెద్దగా ఒత్తి, నూనె లేదా నెయ్యితో పెనంపై వేసి దోరగా కాల్చి తీయాలి.

అంతే కమ్మటి రుచులతో అలరించే జాగరీ రోటీ మకరంద్ తయారైనట్లే..! ఏదేని పొడి డబ్బాలో నిల్వచేస్తే పదిహేను రోజులదాకా నిల్వ ఉండే ఈ జాగరీ రోటీ మకరంద్‌లు వేసవి సెలవుల్లో పిల్లలకు మంచి స్నాక్స్‌గా ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచీ ఉండే వీటిని మీరూ ఓసారి ట్రై చేస్తారు కదూ..?!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుపతి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిరుతిళ్లు తీసిచ్చి అఘాయిత్యం..

లెబనాన్‌ వ్యవసాయ గ్రామాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు-52మంది మృతి

నవంబర్ 6వ తేదీ నుంచి తెలంగాణ స్కూల్స్‌కు హాఫ్ డే.. ఎందుకో తెలుసా?

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"క" కోసం వెళ్తే ఒక్క సీటు కూడా ఖాళీలేదు.. నయన్ సారిక

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

Show comments