Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెరైటీ మూంగ్ "పెసరపప్పు బొబ్బట్లు"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పెసరపప్పు.. అర కేజీ
మైదాపిండి.. ముప్పావు కేజీ
యాలకులు.. ఆరు
ఉప్పు.. చిటికెడు
చక్కెర.. అర కేజీ
నెయ్యి లేదా నూనె.. పావు కేజీ
వంటసోడా.. చిటికెడు

తయారీ విధానం :
నీటిని మరిగించి, కడిగిన పెసరపప్పును వేసి బాగా ఉడికించి నీరు వార్చి ఐదు నిమిషాలపాటు ఆరబెట్టాలి. పెసరపప్పుకు పంచదార, యాలకుల పొడి కలిపి మరీ జారుగా లేదా మరీ గట్టిగా కాకుండా రుబ్బి, ఫ్రిజ్‌లో పది నిమిషాలుంచాలి. మైదాపిండిలో ఉప్పు, వంటసోడా, కరిగించిన నెయ్యి లేదా నూనె కలిపి పూరీల పిండిలాగా కలుపుకోవాలి.

ప్రిజ్‌లోంచి పెసరపప్పు మిశ్రమాన్ని తీసి నచ్చిన సైజుల్లో ఉండలుగా చేసి ఉంచాలి. పూరీల పీటమీద పిండి చల్లి మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా తీసి పూరీల్లా వత్తాలి. ఇప్పుడా పూరీలలో పెసరముద్దను ఉంచి కొసలు మూసివేసి మెల్లిగా చపాతీలాగా చేయాలి. అలా మొత్తం చేసుకున్నాక.. పెనంపై నూనె లేదా నెయ్యి వేసి ఒక్కోదాన్ని రెండువైపులా ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి పెసర బొబ్బట్లు తయార్..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దీపావళి నాడు కుక్క తోకకి చిచ్చుబుడ్డి కట్టి వెలిగించి హింస (video)

పవన్‌ను ప్రసన్నం చేసుకున్న బాబు.. బలైన వర్మ.. నిజమేనా?

పవన్ డాటర్స్.. ట్రోల్స్ తాటతీయనున్న ఏపీ సర్కారు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్‌తో అదరగొట్టింది.. కానీ అక్కడ దొరికిపోయిన సాయి పల్లవి

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

Show comments