Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రాగి వీల్స్‌"లో మిథియోనైన్ అమీనో పుష్కళం

Webdunia
కావలసిన పదార్థాలు :
మైదా.. 300 గ్రా.
వెన్న.. తగినంత
తాజా రాగిపిండి.. 200 గ్రా.
పంచదార పొడి.. 350 గ్రా.
ఎండుకొబ్బరిపొడి.. ఒక కప్పు
చిక్కటి పాలు.. ఒక కప్పు
యాలకులపొడి.. ఒక టీ.
నల్ల మిరియాలపొడి.. అర టీ.
ఉప్పు.. పావు టీ.

తయారీ విధానం :
వెన్న, పంచదార పొడి, యాలకులపొడి, మిరియాల పొడి, ఉప్పు, పాలు పోసి మృదువుగా కలిపి మిశ్రమం తయారుచేయాలి. జల్లించిన మైదా, రాగిపిండి, కొబ్బరిపొడుల్ని కూడా ఈ మిశ్రమంలో కలపాలి. తరువాత అరగంటసేపు దానిని గాలి చొరబడకుండా ఉండేలా ఒక పాత్రలో భద్రపరచాలి. నున్నటి పీట లేదా రాయి మీద ఈ మిశ్రమాన్ని వేసి.. రెండు మడతల్లో అరంగుళం మందంగా ఉండేలా పెద్ద రొట్టెను చేసి కావలసిన సైజుల్లో చాకుతోగానీ అంచులున్న పాత్రతో గానీ కత్తిరించాలి.

నెయ్యి లేదా నూనె రాసిన లోతున్న ప్లేటులో వీటిని ఉంచి, ఇసుక పోసిన కుక్కర్‌లోగానీ మందపాటి పాత్రలో గానీ సుమారు పది నిమిషాల సేపు ఉడికించాలి. అదే మైక్రోవేవ్ ఒవెన్‌లో అయితే 20 నిమిషాలు పాటు 360 డిగ్రీల ఫారెన్‌హీట్‌ దగ్గర బేక్‌ చేసి తీసేయాలి. అంతే రాకి వీల్స్ రెడీ..! పేద ప్రజల ఆహారంలో లోపించిన మిథియోనైన్ అమీనో ఆమ్లం రాగిలో పుష్కళంగా లభిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

Show comments