Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదాతో తీపి బజ్జీలు

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2009 (19:30 IST)
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... పావుకేజీ
చక్కెర పొడి... పావుకేజీ
పెరుగు... రెండు కప్పులు
ఉప్పు... సరిపడా
పచ్చిమిర్చి... ఆరు
పెద్ద ఉల్లిపాయలు... రెండు
జీలకర్ర... ఒక టీస్పూన్
అల్లం... చిన్న ముక్క
కరివేపాకు... రెండు రెబ్బలు
నూనె... పావు కేజీ

తయారీ విధానం :
మైదా పిండిని శుభ్రంగా జల్లించుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లంలను సన్నగా తరిగి ఉంచుకోవాలి. మైదాపిండితో పాటు పైన తరిగి ఉంచుకున్న ముక్కలు, పెరుగు, ఉప్పు, జీలకర్ర, చక్కెర పొడి వేసి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి.

ఈ పిండిని నాలుగు గంటలపాటు నానబెట్టాలి. తరువాత పొయ్యిమీద బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. నూనె కాగుతుండగా చిన్న చిన్న బోండాల లాగా (పునుగులు) వేసి బంగారు వర్ణం వచ్చేదాకా కాల్చి తీయాలి. అంతే మైదాతో తయారైన తీపి బజ్జీలు సిద్ధమైనట్లే..!

తియ్య తియ్యగా, కాస్తంత కారంగా ఉండే ఈ వెరైటీ బజ్జీలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. కావాలంటే, మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి మరి..! తీపి వద్దనుకునేవాళ్ళు చక్కెర పొడి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బజ్జీలను చేసుకోవచ్చు. వీటికి అల్లం చట్నీని సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యమా: కోర్టు అసహనం

నాకు దక్కని ఆమె మరెవ్వరికీ దక్కకూడదు .. ప్రియుడి కిరాతక చర్య

తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: రూ.5లకే ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు

Show comments