Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మామిడి బొబ్బట్లు"తో సమ్మర్ స్పెషల్ రుచులు

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మామిడికాయ తురుము.. ఒక కప్పు
క్యారెట్ తురుము.. రెండు కప్పులు
బీట్‌రూట్ తురుము.. అర కప్పు
పచ్చికోవా.. రెండు కప్పులు
మైదా.. ఆరు కప్పులు
నెయ్యి.. రెండు కప్పులు
పంచదార.. నాలుగు కప్పులు
యాలకులపొడి.. రెండు టీ.
ఉప్పు.. తగినంత
నూనె.. సరిపడా

తయారీ విధానం :
మైదా పిండిలో ఉప్పు, ఆరు టీస్పూన్ల పంచదార, కాసిన్ని పాలు చేర్చి చపాతీ పిండికంటే కాస్త పల్చగా కలిపి గంటసేపు నానబెట్టాలి. బాణలిలో నాలుగు టీస్పూన్ల నెయ్యి వేడిచేసి బీట్‌రూట్, క్యారెట్ తురుములను పచ్చివాసన పోయేదాకా వేయించాలి. దాంట్లోనే మామిడి తురుము కూడా చేర్చి మరికాసేపు వేయించాలి. పదినిమిషాలయ్యాక అందులో పంచదార, అరకప్పు నీటిని పోసి బాగా ఉడికించాలి. మిశ్రమం బాగా ఉడికి ముద్దగా అయిన తరువాత పచ్చికోవా, యాలకుల పొడి చేర్చి కలియబెట్టి స్టౌ ఆపి దించేయాలి.

ఇప్పుడు మైదా పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఒక్కో ఉండను పాలిథిన్ కవర్‌పై నూనె అద్దుతూ చేత్తో చిన్న పూరీల్లా వత్తాలి. అందులో మామిడి మిశ్రమాన్ని ఉంచి, చుట్టూ పిండితో మూసివేసి, మళ్లీ నూనె అద్దుతూ బొబ్బట్లు మాదిరిగా వత్తాలి. అలా మొత్తం పిండినంతా చేసుకుని, పెనంపై తగినంత నెయ్యి వేస్తూ దోరగా కాల్చి తీసేయాలి. అంతే వేడి వేడి మామిడి బొబ్బట్లు తయార్. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా, వెరైటీగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుపతి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిరుతిళ్లు తీసిచ్చి అఘాయిత్యం..

లెబనాన్‌ వ్యవసాయ గ్రామాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు-52మంది మృతి

నవంబర్ 6వ తేదీ నుంచి తెలంగాణ స్కూల్స్‌కు హాఫ్ డే.. ఎందుకో తెలుసా?

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"క" కోసం వెళ్తే ఒక్క సీటు కూడా ఖాళీలేదు.. నయన్ సారిక

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

Show comments