Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రవారికి ఇష్టమైన పెరుగు స్వీట్ "శ్రీకండ్‌"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
తియ్యటి పెరుగు.. ఒక లీ.
పంచదార పొడి.. ఒక కప్పు
యాలకులపొడి.. ఒక టీ.
పాలు.. ఒక టీ.
పిస్తాపప్పు.. ఒక టీ.
బాదంపప్పు.. పది
చారోలిపప్పు.. ఒక టీ.
మిఠాయి రంగు.. చిటికెడు

తయారీ విధానం :
పెరుగుని పల్చని వస్త్రంలో వేసి వదులుగా మూటలా కట్టాలి. అందులోని నీళ్లన్నీ పోయేవరకూ ఈ మూటను మూడు గంటలపాటు వేలాడదీయాలి. ఆ తరువాత ఒక టీస్పూను పాలలో మిఠాయిరంగుని కలపాలి. నీళ్లు కారిపోయిన పెరుగుని ఓ గిన్నెలో వేసి అందులో పంచదార పొడి, మిఠాయి రంగు కలిపిన పాలనీ వేసి గరిటెతో బాగా కలపాలి.

పిస్తాపప్పు, చారోలి పప్పు, బాదంపప్పుల్ని విడివిడిగా, నూనె లేకుండా బాణలిలో వేయించి పెరుగు మిశ్రమంలో కలిపితే శ్రీకండ్‌ రెడీ. దీన్ని చిన్న చిన్న బౌల్స్‌లో సర్ది కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా అందిస్తే ఎంతో రుచిగా ఉంటుంది. అంతే.. మన పొరుగునే ఉన్న మహారాష్ట్రీయులు చాలా ఇష్టంగా తినే శ్రీకండ్ సిద్ధమైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

Show comments