Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం చిక్కీలు తయారు చేయడం ఎలా..!!

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2012 (16:13 IST)
FILE
కావలసిన పదార్థాలు :

బాదం - ఓ కప్పు
వేరుసెనగ పప్పు - ఓ కప్పు
నువ్వులు - ఓ కప్పు
జీడిపప్పు - ఓ కప్పు
నెయ్యి - టేబుల్ స్పూన్
పంచదార - ఓ కప్పు

తయారు చేసే విధాన ం :

స్టవ్ పైన బాణలి పెట్టి అందులో పొట్టుతీసిన వేరుసెనగపప్పు, బాదం, జీడిపప్పు, నువ్వుల్ని ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వేసి దోరగా వేయించుకోవాలి. మరో బాణలిలో పంచదార వేసి కరిగించాలి. అది కరిగి తేనె రంగులోకి వచ్చేదాకా ఉంచి ఆ తరువాత జీడిపప్పు, వేరు సెనగపప్పు, బాదం పలుకులు, నువ్వుల్ని కలిపి దింపేయాలి.

ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పీటమీద పరిచి, నెయ్యి రాసిన రొట్టెల కర్రతో చపాతీ ఒత్తినట్లు చేయాలి. కత్తితో మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవచ్చు. ఇంకా గుండ్రంగా కూడా చేసుకోవచ్చు. అయితే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే రకరకాల ఆకారం కుదురుతుంది. వేడి తగ్గితే అనుకున్న ఆకారం రాదు. ఈ చిక్కీలను నిల్వ ఉంచుకొని ప్రతిరోజు తినచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఇరాక్ గడ్డపై నుంచి ఇజ్రాయేల్‌పై మరోమారు దాడికి ఇరాన్ ప్లాన్

ద్వారకా తిరుమలలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments