Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీతిని పెంచే తీపి రుచి "ఆటా లడ్డు"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
గోధుమరవ్వ.. ఒక కప్పు
నెయ్యి.. రెండు టీ.
బెల్లం.. అర కప్పు
బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష.. అర కప్ప చొప్పున
నూనె.. సరిపడా
గసగసాలు లేదా నువ్వులు.. అలంకరణకు సరిపడా

తయారీ విధానం :
గోధుమరవ్వలో నెయ్యి వేసి, నీళ్లు పోస్తూ గట్టిగా కలిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసి వేయించుకోవాలి. అవి చల్లారిన తరువాత మిక్సీలో వేసి పొడి చేయాలి. పొయ్యి మీద ఒక పాత్రలో మిగిలిన నెయ్యిని వేడి చేసి, అందులో బెల్లం తురుమును వేసి కరగనివ్వాలి. దానికి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా జతచేయాలి.

ఐదు నిమిషాలు అలాగే ఉడికిన తరువాత అందులో ముందుగా పొడి చేసి పెట్టుకున్న గోధుమ ఉండల పొడిని కలపాలి. ఉండలు కట్టకుండా బాగా కలిసేలా కలియబెట్టిన తరువాత కిందికి దించేయాలి. కాస్త ఆరిన తరువాత కావాల్సిన సైజులో ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసి.. అలంకరణకు నువ్వులు లేదా గసగసాలలో అద్దితే... ఇక నోరూరించే ఆటా లడ్డు తినటమే తరువాయి...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

Show comments