Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పెసరపప్పు పాయసం" సాయంత్రపు అల్పాహారం..!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పెసరపప్పు... రెండు కప్పులు
పంచదార.. రెండు కప్పులు
పాలు.. రెండు లీ.
నెయ్యి.. ఒక టీ.
ఎండుద్రాక్ష.. అర కప్పు
యాలకుల పొడి.. కాస్తంత

తయారీ విధానం :
పెసరపప్పును కడగకుండా చేత్తోనే శుభ్రపరచాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి, సన్నని మంటపై ఉంచి, అందులో పెసరపప్పును దోరగా వేయించాలి. కుక్కర్‌లో అరలీటరు పాలు, వేయించిన పెసరపప్పును కలిపి ఉడికించాలి. ఇప్పుడు మిగిలిన పాలకు పంచదార, వేయించిన ఎండుద్రాక్ష చేర్చి బాగా మరగనివ్వాలి.

పాలు సగం అయ్యేవరకు ఉంచాలి. ఇందులో ముందుగా ఉడికించిన పెరసపప్పు మిశ్రమం వేసి, చివరగా యాలకుల పొడి చల్లితే పెసరపప్పు పాయసం తయారైనట్లే...! ఎప్పుడూ పాల పాయసమేనా అంటూ.. పేచీపెట్టే చిన్నారులకు పోషకాలతోపాటు, వెరైటీ రుచిని అందించే పెసరపాయసాన్ని రూచి చూపించండి. ఎప్పుడూ ఇదే కావాలని అడగకపోతే ఒట్టు..! పైగా దీనికి పెద్దగా సమయం కూడా పట్టదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

Show comments