Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీర్ఘాయుష్షును పెంచే "బాదంపాక్‌"

Webdunia
కావలసిన పదార్థాలు :
బాదంపప్పులు.. అర కేజీ
నెయ్యి.. 300 గ్రా.
పంచదార.. 400 గ్రా.
నీళ్లు.. సరిపడా
యాలకుల పొడి.. చిటికెడు
జీలకర్ర.. ఒక టీ.
ఉప్పు.. తగినంత

తయారు చేసే విధానం:
బాదంపప్పును ఉడికించి చల్లారాక పొట్టును తీసేయాలి. వీటికి తగినన్ని నీళ్లు చేర్చి మెత్తని పేస్టులా చేయాలి. తర్వాత బాణలిలో నెయ్యి కరిగించి ఈ బాదంపప్పు ముద్ద వేసి లేతబంగారు వర్ణం వచ్చేవరకు సన్నటి సెగపై వేయించాలి. ఇప్పుడు మరో బాణలిలో కొద్దిగా నీరు పోసి పంచదార ఉండపాకం పట్టాలి.

ఈ పాకానికి ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న బాదంపేస్టు, యాలకుల పొడి, జీలకర్ర, తగినంత ఉప్పు చేర్చి బాగా కలపాలి. సన్నని సెగపై ఉడికిస్తూ.. మిశ్రమం దగ్గర పడేదాకా గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత నెయ్యి రాసిన ప్లేటులో పోసి చల్లారిన తర్వాత ముక్కల్లా కోసుకోవాలి. అంతే నోరూరించే బాదంపాక్‌ రెడీ...! బాదంపప్పును ప్రతిరోజూ ఆహారంలో తీసుకున్నట్లయితే శరీరంలో శక్తిని నింపుతుంది. దీర్ఘాయుష్షును పెంచే గుణాలు దీంట్లో మెండుగా ఉన్నాయి కూడా..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments