Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి లడ్డు

Webdunia
కావలసిన పదార్థాలు :
తాజా శెనగపిండి... అరకేజీ
నూనె... తగినంత
నెయ్యి... వంద గ్రా.
పంచదార... అరకేజీ
బెల్లంతురుము... వంద గ్రా.
జీడిపప్పు... 25 గ్రా.
బాదంపప్పు... 25 గ్రా.
ఎండు ఖర్జూరం... 50 గ్రా.
ఎండుద్రాక్ష... 50 గ్రా.
యాలకులపొడి... 25 గ్రా.
పటికబెల్లం పలుకులు... ఒక టీ.
పచ్చకర్పూరం పొడి... పావు టీ.

తయారీ విధానం :
సెనగపిండిలో తగినన్ని నీళ్లు పోసి, బూందీపిండిలా కలపాలి. దీనిని నూనె కాగాక అందులో బూందీలాగా వేసి దోరగా వేయించి తీసివేసి, ఆరబెట్టాలి. చల్లారాక సగం బూందీని దంచి పొడిచేయాలి. బెల్లం విడిగా పాకం పట్టి ఉంచాలి. పంచదార తీగపాకం రానిచ్చి అందులో బెల్లంపాకం కలిపి యాలకుల పొడి, పచ్చకర్పూరంకూడా వేసి కలపాలి.

విడిగా మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పు దోరగా వేయించాలి. వేడిపాకంలో బూందీ, బూందీపొడి, జీడిపప్పు, బాదంపప్పు, ఎండుఖర్జూరం, ఎండుద్రాక్ష, నెయ్యి పోసి బాగా కలిపి ఓ పూటంతా అలాగే ఉంచి, చల్లారనివ్వాలి. తరువాత పటికబెల్లం పలుకులు వేసి బాగా కలిపి కావలసిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. అంతే తిరుమల శ్రీవారి లడ్డూలు రెడీ..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రసన్నకుమార్ ఇంటిపైదాడి.. జగన్మోహన్ రెడ్డి ఫోనులో పరామర్శ

అమ్మకు దెయ్యం పట్టిందని కర్రలతో కొట్టి చంపించిన కుమారుడు...

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. కారణం ఏంటి.. వర్షాలు ఎప్పటి నుంచి?

పిల్లలు పుట్టిస్తానంటూ మురుగు నీరు తాపించారు.... తాంత్రికుడి క్రూరత్వానికి నిండు ప్రాణం పోయింది...

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

Show comments