Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైఫ్రూట్స్‌తో కజ్జికాయలు

Webdunia
కావలసిన పదార్థాలు :
ఎండు ఖర్జూరాలు... 600 గ్రా.
మైదా పిండి... ఒక కేజీ
కిస్‌మిస్... 200 గ్రా.
జీడిపప్పు... 200 గ్రా.
ఉప్పు... కొద్దిగా
నూనె... వేయించేందుకు సరిపడా
వేయించిన శనగపప్పు... 300 గ్రా.
యాలకుల పొడి... ఒక టీ.
ఎండుకొబ్బరి... 400 గ్రా.
పల్లీలు... 200 గ్రా.

తయారీ విధానం :
మైదాపిండిలో కొద్దిగా ఉప్పు కలిపి రెండు టేబుల్‌స్పూన్ల నూనె, తగినన్ని నీళ్లు కలిపి ముద్దలా చేయాలి. ఎండు ఖర్జూరాల్ని దంచి అందులోని గింజల్ని తీసేసి తరువాత ఖర్జూరాల్ని మిక్సీలో వేసి కాస్త కచ్చాపచ్చాగా చేయాలి. వేరుసెనగపప్పును వేయించాలి. వీటిని జీడిపప్పు, శనగపప్పుతో కలిపి పొడి చేయాలి. ఈ పొడిలోనే కిస్‌మిస్‌, యాలకులపొడి, కొబ్బరి తురుము అన్నీ కలపాలి.

మైదాపిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తాలి. అందులో డ్రైఫ్రూట్‌ మిశ్రమాన్ని పెట్టి రెండువైపులా మూసేసి, కజ్జికాయలా వత్తాలి. ఇప్పుడు వీటిని నాలుగైదు చొప్పున నూనెలో వేయించి తీసేయాలి. వీటిలో పంచదార ఉండదు కాబట్టి, మధుమేహ రోగులు కూడా చక్కగా తినవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

6 నిమిషాల్లో 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను పట్టేసిన మహిళ (video)

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

Show comments