Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్స్ హెల్దీ ఫుడ్ "యాపిల్ కోవా"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు... ఒక కప్పు
పాలు.. ఒక కప్పు
జీడిపప్పు.. 15 గ్రా.
పంచదార.. ఒక కప్పు
పచ్చికోవా.. ఒక కప్పు
బాదంపొడి.. అర కప్పు
యాలక్కాయలపొడి.. ఒక టీ.
నెయ్యి.. తగినంత

తయారీ విధానం :
ముందుగా నేతిలో జీడిపపప్పు వేయించుకోవాలి. తరువాత పాలు మరిగించాలి. దాంట్లో పచ్చికోవాతో పాటు పంచదార కూడా వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం బాగా మరుగుతుండగా యాపిల్ ముక్కల్ని వేసి కలియబెట్టాలి. కాసేపు అలాగే ఉడికిన తరువాత బాదంపొడి వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి.

ఈ మిశ్రమం బాగా దగ్గరయ్యేంతదాకా స్టవ్‌పై అలాగే ఉంచి గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరగా అందులో తగినంత నెయ్యి, యాలకుల పొడి వేసి కలియబెట్టి దించేయాలి. అంతే యాపిల్ కోవా తయారైనట్లే..! వెరైటీగా రుచిగా ఉండే ఈ యాపిల్ కోవాను చిన్నపిల్లలతోపాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

Show comments