Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిలేబీల్లాంటి పాలబుగ్గలకు "పనీర్‌ జిలేబీ"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పనీర్... 400 గ్రా.
పచ్చికోవా... 400 గ్రా.
యాలకులపొడి... ఒక టీ.
రెడ్ ఆరెంజ్ కలర్... చిటికెడు
నెయ్యి... వేయించేందుకు సరిపడా
పంచదార... 1 కేజీ 200 గ్రా.

తయారీ విధానం :
తాజా పనీర్‌ను తురిమి ఓ ప్లేటులో వేసి మెత్తని పిండి ముద్దగా చేయాలి. తరువాత అందులోనే పచ్చికోవా, యాలకులపొడి, రెడ్ ఆరెంజ్ కలర్ కలిపి తగినన్ని నీళ్లు చల్లి కాస్త జారుగా జిలేబీ మిశ్రమంలా చేయాలి. స్టవ్‌మీద మందపాటి గిన్నె పెట్టి అందులో పంచదార వేసి ఒకటిన్నర గ్లాసు నీళ్లు కలిపి పలుచని తీగ పాకం వచ్చాక దించేయాలి.

ఇప్పుడు మందపాటి పాలిథిన్‌ కవరును తీసుకుని దానికి ఓ మూల చిల్లు పెట్టి అందులో జిలేబీ మిశ్రమాన్ని నింపాలి. లేదా పలుచని చేతిరుమాలుకు చిల్లు పెట్టి అందులో పిండిని నింపి అంచుల్ని బిగించి పట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి అందులో ఈ పిండిని గుండ్రంగా జిలేబీల్లా తిప్పుతూ వత్తాలి. వీటిని ఎర్రగా వేయించి తీసి వెంటనే పక్కనే ఉంచుకున్న పాకంలో ముంచి తీసేయాలి. అంతే పనీర్ జిలేబీలు సిద్ధమైనట్లే...! అద్భుతమైన రుచితో అలరించే ఈ జిలేబీని చిన్నారులు ఎంతో ఇష్టంగా తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

Show comments