Webdunia - Bharat's app for daily news and videos

Install App

"గోరు మీఠీ"లను ఎంచక్కా లాగించేయొచ్చు..!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మైదా.. రెండు కప్పులు
బొంబాయి రవ్వ.. రెండు కప్పులు
పంచదార.. నాలుగు కప్పులు
నూనె.. వేయించేందుకు సరిపడా
వెన్న.. తగినంత

తయారీ విధానం :
గిన్నెలో మైదా, రవ్వ, వెన్న వేసి తగినన్ని నీళ్లుపోసి చపాతీల పిండికంటే కాస్త పలుచగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని అలాగే 10 నిమిషాలపాటు పక్కనుంచాలి. తరువాత ఆ పిండిని తీసి ఓ మోస్తరు ఉండలుగా చేసి, రెండువేళ్ల మధ్యలో ఒక్కో ఉండను ఉంచి నొక్కుతూ పొడవాటి గోళ్లలాగా చేయాలి.

అలా మొత్తం పిండితో చేసుకున్నాక వాటిని బాగా కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార తీసుకుని, కాసిన్ని నీళ్లుపోసి ఉండపాకం వచ్చేలా చూడాలి. ఈ పాకాన్ని పైన వేయించి పెట్టుకున్న వాటిపై పోసి బాగా కలియబెట్టాలి. పాకం చల్లారేకొద్దీ వాటికి గట్టిగా పట్టుకుని తెల్లగా కనిపిస్తుంది. అంతే గోరు మీఠీలు తయార్..! పిల్లలకోసం వెరైటీగా స్నాక్స్ చేసివ్వాలనుకునేవారు వీటిని ట్రై చేయవచ్చు. చేయడం తేలికే..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments