Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ పిండి పూర్ణాలు

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2009 (19:36 IST)
FileND
కావలసిన పదార్థాలు :
గోధుమ పిండి... పావు కేజీ
పచ్చి శనగపప్పు... పావు కేజీ
బెల్లం... పావు కేజీ
పచ్చికొబ్బరి... ఒక చిప్ప
యాలక్కాయలు... పది
నూనె... అరకేజీ

తయారీ విధానం :
ముందుగా పచ్చి శనగపప్పులో రాళ్ళు లేకుండా చేసుకోవాలి. బెల్లం తరిగి ఉంచుకుని, యాలక్కాయలను పొడిచేసి ఉంచుకోవాలి. అలాగే, పచ్చికొబ్బరిని తురిమి, గోధుమపిండిని జల్లించుకోవాలి. తరువాత పచ్చి శనగపప్పును రెండు గంటలపాటు నానబెట్టి నీళ్ళన్నీ ఒంపేసి... కుక్కర్‌లో ఉడక బెట్టాలి. ఉడికిన పప్పును బాగా ఆరనివ్వాలి. తరువాత రోట్లోగానీ, మిక్సీలోగాని వేసి మెత్తగా నూరుకోవాలి.

తురిమిన బెల్లంను మెత్తగా నూరుకున్న పప్పుకు కలపాలి. చివరిగా కొబ్బరి, యాలక్కాయల పొడిని కూడా కలపాలి. ఇలా చేసినప్పుడు పిండి జారుగా అయినట్లు అనిపిస్తే కాసేపు పొయ్యిమీద ఉంచితే గట్టిపడుతుంది. అయితే వేడిచేసేటప్పుడు అడుగంటకుండా జాగ్రత్తపడాలి. పిండి గట్టిపడిన తరువాత తీసి మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలి.

మరోవైపు జల్లించి ఉంచుకున్న గోధుమపిండిలో కాస్తంత ఉప్పువేసి జారుగా కలుపుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి, మరుగుతుండగా పూర్ణం ఉండలను గోధుమపిండిలో ముంచి వేయాలి. బంగారు వర్ణం వచ్చేదాకా వాటిని వేయించి తీసేయాలి. అంతే గోధుమపిండి పూర్ణాలు సిద్ధమైనట్లే..! వేడి చల్లారిన తరువాత వీటిని తింటే చాలా రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Show comments