Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖర్జూరం కుడుములు" షుగర్ ఉన్నా లాగించేయవచ్చు..!

Webdunia
కావలసిన పదార్థాలు :
బియ్యం రవ్వ.. ఒక కప్పు
పెసరపప్పు.. పావు కప్పు
ఖర్జూరం.. ఒక కప్పు
కొబ్బరికాయ.. సగం
నెయ్యి.. 50 గ్రా.
యాలకుల పొడి.. కాస్తంత
మంచినీరు, పాలు.. 3 కప్పులు

తయారు చేయు విధానం :
ముందుగా ఒక గ్లాసు బియ్యపు రవ్వకి మూడు గ్లాసుల నీరు, పాలు కలిపి ఎసరు పెట్టుకోవాలి. నీరు మరుగుతున్నప్పుడు పెసరపప్పును వేయాలి. నీరు బాగా మరిగిన తర్వాత బియ్యపు రవ్వని పోసి ముద్దకాకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. మెత్తగా అయిన ఖర్జూరంలో కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి.

ఈ మొత్తం మిశ్రమాన్ని ఉడికించిన బియ్యపు రవ్వలో కలపాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలు రవుండుగా కాని, కోలగా కానీ ఒత్తుకోవాలి. ఆ తర్వాత వీటిని కుక్కర్‌లో ఆవిరి మీద 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది షుగర్ పేషంట్లకు కూడా మంచింది. స్వీట్ కుడుములు వద్దనుకునేవారు ఖర్జూరాన్ని కలుపుకోకుండా హాట్ కుడుములు కూడా చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments