Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరితో ఘుమఘమలాడే "నేతి చలిమిడి"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బియ్యం.. ఒక కేజీ
కొబ్బరికాయ.. ఒకటి
నెయ్యి.. 50 గ్రా.
బెల్లం.. ముప్పావు కేజీ
గసగసాలు.. 50 గ్రా.

తయారీ విధానం :
బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీటిలో నానబెట్టి రెండు రోజులపాటు అలాగే ఉంచేయాలి. ఏ రోజుకారోజు నీటిని మారుస్తూ ఉండాలి. తర్వాత ఆ బియ్యాన్ని కాసేపు నీడలో ఆరబెట్టి.. గ్రైండర్‌లోగానీ, రోట్లోగానీ వేసి మెత్తగా పిండి కొట్టి.. జల్లించి ఉంచాలి. కొబ్బరికాయను పగులగొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి నేతిలో వేయించి ఉంచాలి. గసగసాలను కూడా నేతిలో వేయించి ఉంచాలి.

ఇప్పుడు తగినన్ని నీళ్లలో బెల్లాన్ని వేసి పాకం పట్టాలి. అందులో కొద్ది కొద్దిగా పిండిని పోస్తూ బాగా కలియబెడుతూ పాకంలో పిండి బాగా కలిసేలా చూడాలి. అలా పిండి బాగా కలిసింది అనుకున్న తరువాత వేయించిన కొబ్బరి ముక్కలను వేసి కలపాలి. చివర్లో ఈ మిశ్రమాన్ని స్టవ్ మీదినుంచి దించే ముందుగా గసగసాలను కూడా వేసి బాగా కలియదిప్పి దించేయాలి. చల్లారిన తరువాత అలాగే అయినా లేదా ఏదైనా షేప్‌లో చేసుకుని అయినా దీనిని తినవచ్చు. అంతే నేతి చలిమిడి రెడీ..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

Show comments