Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజాలు

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2007 (19:45 IST)
కావలసిన వస్తువులు:

మైదా : పావు కిలో
పంచదార : అర కిలో
నూనె : పావు కిలో

ఇలా చెయ్యాలి :

వాసన లేని మైదా పిండి తీసుకొని జల్లెడపట్టి కొద్దిగా నెయ్యి వేసి పూరీల పిండిలా తడిపి ఒక గంటసేపు నానబెట్టాలి. దీనితో పాటు అరకిలో పంచదారను లేతపాకంపట్టి ఉంచుకోవాలి. మైదా పిండి అంతటినీ నిమ్మకాయంత ఉండలుగా చేసుకొని, చపాతి సైజులో వత్తుకోవాలి. నాలుగేసి మైదా చపాతీలను ఒక దాని మీద ఒకటి వేస్తూ వాటి మధ్యన కొద్దిగా నెయ్యి రాస్తూ చాపచుట్టలా చుట్టండి. తర్వాత ఆ చుట్టలను చాకుతో ఒక అంగుళము వెడల్పున ముక్కలుగా కోసుకోండి.

ఇదంతా పూర్తయ్యాక ఈ ముక్కలను మరిగే నూనెలో వేసి, గోధుమరంగు వచ్చేవరకూ వేయించాలి. ఆ తర్వాత దించి ఉన్న పాకంలో వేసి కొద్దిసేపు ఉండనిచ్చి తీసేయాలి. మిగిలిన ముక్కలన్నిటినీ ఇలాగే చేయాలి. కాజాలు అన్నిటినీ పాకంలో ముంచి తీసిన తరువాత కొద్దిగా పాకం ఉంటుంది. అప్పుడు మళ్ళీ కాజాలను కొంచెం కొంచెం చొప్పున పాకంలో వేసి, డబ్బాలో పెట్టాలి.

కాజాలను మరోలా కూడా మడుచుకోవచ్చును. మైదా చపాతీ (నాలుగేసి చొప్పున కలపక ముందే) ఒక్కో దానినీ అర అంగుళము వెడల్పున ముక్కలుగా కోయండి. ఇలాంటి నాలుగేసి ముక్కలను కలిపి, మూడు అంగుళాల పొడవు పెట్టి కొసలను నొక్కి వేయిస్తే పువ్వు ఆకారంలో ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments