Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాష్టమి నాడు తులసీదళాల నీటితో స్నానమాచరిస్తే?

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2013 (22:45 IST)
WD
" గీతాచార్యుడు" కృష్ణపరమాత్మ జన్మాష్టమినాడు సూర్యోదయమునకు పూర్వమే లేచి చల్లని నీటిలో "తులసీదళము" లను ఉంచి స్నానమాచరించిన సమస్త పుణ్య తీర్థములలోను స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారని విశ్వాసం.

ఆ రోజు సర్వులూ వారి వారి గృహాలను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కృష్ణపాదాలను రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మను ఆహ్వానం పలుకుతూ, ఊయలలో ఓ చిన్ని కృష్ణుని ప్రతిమను వుంచి, రకరకాల పూలతో, గంథాక్షతలతో యధావిధిగా పూజించి, ధూపదీప నైవేద్యములతో ఆ స్వామిని ఆరాధించి భక్తులకు తీర్థ ప్రసాదములు, దక్షిణ తాంబూలములు సమర్పించుకొనుట ఎంతో మంచిది. ఇంతేకాక చాలా చోట్ల కృష్ణపరమాత్మ లీలల్లో ఒక లీలగా ఉట్టికుండ కొట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు.

జయతు జయతు దేవో దేవకీ నందనోయం
కృష్ణ! త్వదీయ పదపంకజ పంజర్తానం
అద్వైవమే విశతు మానసరాజహంసః ||
ప్రాణ ప్రయాణసమమే కఫవాత పిత్తై
కంఠావరోధనవిదే స్మరణం కుతస్తౌ ||

ఓ కృష్ణా! మరణసమయాన నిన్ను స్మరించుచూ నీలో ఐక్యమవ్వాలని కోరిక ఉన్నది కాని! ఆ వేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను స్మరించగలనో! లేనో? అని తలచి ఇప్పుడే నా 'మానస రాజవాస' ను శతృఅబేధ్యమైన "నీపాద పద్మ వజ్రపంజర" మందు ఉంచుతున్నాను తండ్రీ. అంటూ పై మంత్రాన్ని శ్రీకృష్ణాష్టమి రోజున పఠించిన వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనమామతో ప్రేమ - షూటర్లతో భర్తను చంపించిన నవ వధువు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం.. ఎలా జరిగింది?

ఢిల్లీలో దారుణం : ఫ్లాట్‌లో జంట హత్యలు - విగతజీవులుగా తల్లీకొడుకు

Cardiac Arrest: 170 కిలోల బరువు.. తగ్గుదామని జిమ్‌కు వెళ్లాడు.. గుండెపోటుతో మృతి (video)

ప్రధాని మోడీకి అరుదైన గౌవరం..."ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా"

అన్నీ చూడండి

లేటెస్ట్

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

29-06-2025 నుంచి 01-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

Show comments