శ్రీరామనవమి నాడు దీపారాధనకు కొబ్బరినూనె వాడండి

Webdunia
FILE
శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగులు దుస్తులు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముదు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి.

శ్రీ సీతారామలక్ష్మణ, భరత, శతృఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి.

అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.

ఇక శ్రీరామ దేవాలయం, భద్రాచలం, ఒంటిమెట్ట, గొల్లల మామిడాడ వంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతముతో అభిషేకం, శ్రీరామ ధ్యానశ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణము వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకలసంపదలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతమును ఆచరించడం మంచిది.

నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచుదీపము, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. దీపారాధనకు కొబ్బరినూనెను వాడాలి. పూజచేసేటప్పుడు తులసిమాలను ధరించడం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత శ్రీ రామరక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయని పురోహితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏనుగుతో సెల్ఫీ కోసం ప్రయత్నం, తొక్కి చంపేసింది (video)

కస్టడీ కేసు: ఆర్ఆర్ఆర్‌‌ను సస్పెండ్ చేయండి.. సునీల్ కుమార్ ఎక్స్‌లో కామెంట్లు

Ranga Reddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా అగ్రస్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా.. ఎలా?

తెలంగాణ ఎన్నికల్లోనూ జగన్‌ను ఓడించిన చంద్రబాబు.. ఎలాగంటే?

Baba Vanga: 2026లో భూమిపైకి గ్రహాంతరవాసులు వస్తారట.. ఏఐతో ముప్పు

అన్నీ చూడండి

లేటెస్ట్

Saphala Ekadashi 2025: సఫల ఏకాదశి తిథి: ఉసిరి కాయలతో, దానిమ్మ పండ్లతో పూజిస్తే..

15-12-2025 సోమవారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

14-12-2025 నుంచి 20-12-2025 వరకు మీ వార రాశిఫలాలు

14-12-2025 ఆదివారం ఫలితాలు - పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు...

13-12-2025 శనివారం ఫలితాలు - సర్వత్రా అనుకూలం.. కష్టం ఫలిస్తుంది...

Show comments