వింబుల్డన్ సింగిల్స్ విజేతగా జకోవిచ్ - కెరీర్‌లో నాలుగో టైటిల్

ప్రతిష్టాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ దుమ్మురేపాడు. తన మునుపటి ఫామ్, ఆటతీరును ప్రదర్శించిన జకోవిచ్ అంచనాలకు తగ్గట్టుగా రాణించి అభిమానుల కల నెరవేర్చాడు.

Webdunia
సోమవారం, 16 జులై 2018 (09:35 IST)
ప్రతిష్టాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ దుమ్మురేపాడు. తన మునుపటి ఫామ్, ఆటతీరును ప్రదర్శించిన జకోవిచ్ అంచనాలకు తగ్గట్టుగా రాణించి అభిమానుల కల నెరవేర్చాడు. అలాగే, తన కెరీర్‌లో నాలుగో వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. మొత్తంగా అతనికి 13వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.
 
ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీలో జకోవిచ్ 6-2, 6-2, 7-6(3) తేడాతో సౌతాఫ్రికా స్టార్, ఎనిమిదో సీడ్ కెవిన్ అండర్సన్‌‌పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లను జకోవిచ్ అలవోకగా గెలుచుకున్నప్పటికీ మూడో సెట్‌‌లో ప్రత్యర్థి నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది.
 
మూడో సెట్‌‌లో జకోవిచ్ - ఆండర్సన్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. టైబ్రేక్‌‌కు దారి తీయడంతో ఆ సెట్‌‌లో నూ జకోవిచ్ 6-3తేడాతో గెలిచి టైటిల్‌‌ను ముద్దాడాడు. ఈ టోర్నీలో అండర్సన్‌‌కు ఇదే తొలి వింబుల్డన్ ఫైనల్ కావడం విశేషం. కాగా, జకోవిచ్ గతంలో 2011, 2014, 2015 సంవత్సరాల్లో వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో అత్యధికంగా వరకట్న హత్యలు.. ఏడింటింలో మూడు హైదరాబాదులోనే

అనధికార తవ్వకం కారణంగా హిందూపూర్‌లో దెబ్బతిన్న సిటీ గ్యాస్ పైప్‌లైన్

CBN-Jagan: తిరుపతితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్‌కు బాంబు బెదిరింపులు

Chandra Babu Naidu: ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం.. ధృవీకరించిన చంద్రబాబు

ఒడిశా తీరాన్ని దాటిన తుఫాను- ఆంధ్రలో భారీ వర్షాలు: నలుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jana Nayagan: కరూర్ ఘటన: విజయ్ జన నాయగన్ పాట విడుదల వాయిదా

Chiranjeevi : నా వయస్సుకు సరిపడా విలన్ దొరికాడన్న చిరంజీవి !

Ram Charan: ఢిల్లీలో రావణ దహనం చేసి ఆర్చరీ క్రీడాకారులకు స్పూర్తినింపిన రామ్ చరణ్

నా కుమార్తె న్యూడ్ ఫోటోలు అడిగారు: నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన

ముగిసిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నిశ్చితార్థం

తర్వాతి కథనం
Show comments