Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింధు అలా ప్రవర్తించిందా.. ఎల్లోకార్డు కూడా చూపించారు.. నెట్టింట్లో చర్చ..

గ్లాస్గోలో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రజత పతకం సాధించి రికార్డు సృష్టించింది. జపాన్‌కు చెందిన నోజోమి ఒకుహారాతో హోరాహోరీగా జరిగిన పోరులో సింధు

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (10:15 IST)
గ్లాస్గోలో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రజత పతకం సాధించి రికార్డు సృష్టించింది. జపాన్‌కు చెందిన నోజోమి ఒకుహారాతో హోరాహోరీగా జరిగిన పోరులో సింధు ఓడిపోయినా రజతంతో తిరుగుముఖం పట్టింది. కానీ ఈ మ్యాచ్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో సింధు ప్రవర్తన ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 
 
మైదానంలో సింధు ప్రవర్తన సరిగా లేకపోవడం, బ్యాడ్మింటన్ చట్టాలను ఉల్లంఘించిందన్న కారణంతో అంపైర్ సింధుకు ఎల్లోకార్డు చూపించారు. ప్రత్యర్థి కోర్టులోకి రాకెట్‌ను విసరడంతో పాటు అంపైర్ అనుమతి లేకుండా మైదానం నుంచి బయటికి పోవడం.. మ్యాచ్‌ను ఆలస్యం చేయడం వంటి ఆరోపణలపై ఆమెకు ఎల్లోకార్డు చూపించారు. ప్రస్తుతం సింధుకు ఎల్లోకార్డుపై ట్విట్టర్ మోతెక్కిపోతోంది. ఇలాంటివి పట్టించుకోకుండా సింధు ముందుకెళ్లాలని కొందరు, అంపైర్ ఎవరో స్కూల్ టీచర్‌లా ఉన్నాడని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
 
కాగా.. వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో పీవీ సింధు పోరాడి ఓడిపోయింది. జపాన్‌ ప్లేయర్‌ ఒకుహర చేతిలో 19-21, 22-20, 20-22 స్కోరు తేడాతో పరాజయం పాలైంది. దీంతో సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments