Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ గేమ్స్ : తొలిరోజే స్వర్ణంతో బోణీ చేసిన భారత్

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (11:25 IST)
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిరోజే భారత్ స్వర్ణ పతకంతో బోణీ చేసింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో కుము క్చమ్‌చాను సంజితా చాను స్వర్ణ పతకం సాధించగా, సయకొమ్ మీరాబాయ్ చాను రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 
 
మొదటి రెండు స్థానాలను భారత్ కైవసం చేసుకోగా, కాంస్య పతకాన్ని నైజీరియాకు చెందిన కెచి ఓపరా తన ఖాతాలో చేర్చుకుంది. సంజిత మొత్తం 173 కిలోల బరువునెత్తి సత్తా చాటింది. మీరాబాయ్ 170 కిలోల బరువునెత్తి ప్రత్యర్థులకు గట్టిషాకిచ్చారు. కాగా, అగ స్టీనా కెమ్ నవొకొలో 175 కిలోలతో నెలకొల్పిన కామన్వెల్త్ గేమ్స్ రికార్డును సమం చేసే అవకాశాన్ని సంజిత తృటిలో కోల్పోయంది. 
 
ఇకపోతే.. భారత్ జూడో క్రీడాంశంలో మూడు పతకాలు కైవసం చేసుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో నవ్‌జోత్ చనా, మహిళల 48 కేజీల విభాగంలో సుశీలా లిక్మబామ్ రజతాలు గెలుచుకున్నారు. ఇక, మహిళల 52 కిలోల విభాగంలో కల్పనా తౌడమ్ కాంస్యంతో సరిపెట్టుకుంది. దీంతో, తొలిరోజు భారత్ ఖాతాలో మొత్తం ఏడు పతకాలు చేరాయి. 
 
కాగా, పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. రెండు బంగారు, మూడు వెండి, రెండు రజతంలతో మొత్తం ఏడు పతకాలు కైవసం చేసుకుంది. అగ్రస్థానంలో ఇంగ్లండ్ ఉంది. ఈ దేశం మొత్తం ఆరు బంగారు పతకాలతో మొత్తం 17 పతకాలు తన ఖాతాలో వేసుకుంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా, మూడో స్థానంలో స్కాట్‌లాండ్ దేశాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments