Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ : హోరాహోరీ ప్రిక్వార్టర్స్‌లో భజరంగ్‌ విజయం

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (10:13 IST)
టోక్యో ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భారత రెజ్లర్‌ భజరంగ్‌ పునియా అద్భుతం చేశాడు. 65కిలోల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో కజక్‌స్థాన్‌కు చెందిన అక్మత్‌ అలీని 3-3 తేడాతో ఓడించాడు. 
 
వీరిద్దరి మధ్య పోరు ఫైనల్‌ను తలపించింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు. మొదటి పిరియడ్‌లో బజరంగ్‌ టచ్‌డౌన్‌ ద్వారా 1 పాయింట్‌ అందుకున్నాడు. 
 
మరో సారి ప్రత్యర్థిని రింగు బయటకు పంపించి 2 పాయింట్లు సంపాదించి 3-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రత్యర్థికి 1 పాయింటు లభించింది. అయితే రెండో పిరియడ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. బజరంగ్‌ను అక్మత్‌ లాక్‌ చేసినా అతడు తప్పించుకొన్నాడు. 
 
అక్మత్‌ 2 పాయింట్లు సాధించి స్కోరును 3-3తో సమం చేసినా ఒక దఫాలో బజరంగ్‌ ఒకేసారి 2 పాయింట్లు అందుకోవడంతో విజయం అతడినే వరించింది. క్వార్టర్‌ ఫైనల్లో అతడు ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మొర్తజాతో తలపడతాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో దారుణం... ఇండోఅమెరికన్‌ ముఖంపై దుండగుడి పిడిగుద్దులు... మృతి!!

ఘాట్ రోడ్డులో మహిళను చంపేసిన చిరుతపులి

వివాహ విందు: చికెన్ బిర్యానీలో లెగ్ పీసులు ఎక్కడ..? కొట్టుకున్న అతిథులు!

భార్య స్టెల్లాను పైకెత్తుకుని ముద్దెట్టిన జూలియన్ అసాంజే

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో గద్దలు... రూ.2096 కోట్ల నిధులుంటే.. మిగిలింది రూ.7 కోట్లే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

తర్వాతి కథనం
Show comments