Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోపన్న - నేను మాట్లాడుకోలేదు... అందుకే మొబైల్ స్విచాఫ్ చేశా : సానియా మీర్జా

రియో ఒలింపిక్స్ క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తృటిలో పతకం చేజార్చుకున్న సానియా మీర్జా... ఆ ఓటమిపై ఇపుడు స్పందించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత తాను, రోహన్ బోపన్న అనుభవించిన వేదన అంతాఇంతా కాద

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (09:37 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తృటిలో పతకం చేజార్చుకున్న సానియా మీర్జా... ఆ ఓటమిపై ఇపుడు స్పందించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత తాను, రోహన్ బోపన్న అనుభవించిన వేదన అంతాఇంతా కాదని పేర్కొంది. 
 
తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పతక పోరు ముగిసిన రెండు గంటల్లోనే తాను, బోపన్న కలిసి సిన్సినాటి టోర్నీకి బయలుదేరామని, తామిద్దరం సుమారు గంట పాటు ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదని, తన మొబైల్‌ను కూడా స్విచ్చాఫ్ చేశానని వెల్లడించింది. ఓటమి తర్వాత వర్ణించలేనంత బాధను అనుభవించామని చెప్పుకొచ్చింది. 
 
ఒలింపిక్స్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి ఉంటే అంతగా బాధపడి ఉండేవాళ్లం కాదని, కానీ తృటిలో పతకాన్ని చేజార్చుకోవడంతో తన గుండె పగిలినట్టు అయిందని తెలిపింది. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవడం కూడా చిన్న విషయమేమీ కాదని పేర్కొంది. 
 
లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం తమను బాధించింది. పోరు ముగిశాక క్రీడా గ్రామం నుంచి విమానాశ్రయానికి వెళ్లడానికి 1:15 గంటలు పట్టిందని, ఆ సమయంలో ఒకటి రెండు మాటలు తప్పితే పెద్దగా మాట్లాడుకోలేదని తెలిపింది.  పేర్కొంది. ‘‘బాధపడకు, వచ్చేసారి చూద్దాం’’ వంటి సందేశాలు తనకు ఇష్టముండదని, అందుకే సెల్ స్విచ్చాఫ్ చేశానని వివరించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పొరిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తర్వాతి కథనం
Show comments