Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధుకు వెయ్యి గజాల ఇంటి స్థలం.. పత్రాలను అందజేసిన కేసీఆర్

ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీల్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు తెలంగాణ సర్కారు వెయ్యి గజాల ఇంటి స్థలం కేటాయించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో పీవీ సింధుకు అందజే

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (10:15 IST)
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీల్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు తెలంగాణ సర్కారు వెయ్యి గజాల ఇంటి స్థలం కేటాయించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో పీవీ సింధుకు అందజేశారు. ఇందుకు ఆమె సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. బాడ్మింటన్‌లో మరింతగా రాణించాలని సీఎం ఆకాంక్షించారు.
 
ప్రపంచ క్రీడా వేదికపై హైదరాబాద్‌ పేరు నిలబెట్టాలన్నారు. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించి హైదరాబాద్‌ గడ్డపై అడుగు పెట్టిన రోజే సింధుకు ఇంటి స్థలం కేటాయిస్తామని తెలంగాణ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే.. సీనియర్ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై బాలీవుడ్‌లో బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే స్ఫూర్తితో తెలుగుతేజం, ఒలింపిక్‌ రజత పతక విజేత పీవీ సింధు జీవిత కథ ఆధారంగా నటుడు సోనూసూద్‌ బయోపిక్‌‌ను తెరకెక్కించునున్నాడు. 
 
ఈ విషయాన్ని సోనూసూద్‌ మీడియాతో స్వయంగా తెలిపారు. ఎనిమిది నెలల నుంచి సింధు బయోపిక్‌ గురించి చర్చిస్తున్నామని త్వరలో నటీనటుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. పీవీ సింధు తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొందో అందరూ తెలుసుకోవాలని సోనూసూద్ అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments