Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో విజేందర్ సింగ్ జైత్రయాత్ర.. సోల్డ్రాపై గెలుపు

Webdunia
శనివారం, 14 మే 2016 (12:57 IST)
భారత బాక్సర్ విజేందర్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో మరోసారి విజేందర్ సింగ్ తన సత్తా ఏంటో చాటుకున్నాడు. ప్రత్యర్థులు మారినా విజేందర్‌ పంచ్‌‌లతో అదరగొడుతున్నాడు. తన ఆరో బౌట్‌లోనూ విజేందర్‌ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. ప్రొ బాక్సింగ్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తూ ఆరో నాకౌట్‌ విజయంతో సత్తాచాటాడు.
 
శుక్రవారం జరిగిన ఎనిమిది రౌండ్ల పోరులోనూ విజేందర్‌ పోలెండ్‌ బాక్సర్‌ ఆంద్రెజ్‌ సోల్డ్రాను చిత్తు చేశాడు. ఈ బౌట్‌ను కూడా హర్యానా బాక్సర్‌ కేవలం పది నిమిషాలలోపే ముచ్చటగా మూడు రౌండ్లలోనే ముగించి ఔరా అనిపించాడు. దూకుడే మంత్రంగా విజేందర్ చెలరేగిపోయాడు. 
 
ఆద్యంతం మెరుగ్గా రాణించాడు. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న విజేందర్‌ పంచ్‌లతో సోల్డ్రా కళ్ళు బైర్లు కమ్మేలా చేశాడు. అతను పోరాడలేక పక్కకు తప్పుకోవడంతో.. అంపైర్‌ బౌట్‌ను నిలిపి విజేందర్‌ను విజేతగా ప్రకటించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

తర్వాతి కథనం
Show comments