Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితాన్ని సమీక్షించుకుంటున్నా... షోయబ్‌తో విడాకుల తర్వాత సానియా ట్వీట్

వరుణ్
శుక్రవారం, 26 జనవరి 2024 (14:16 IST)
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న తర్వాత భారత టెన్నిస్ మాజీ క్రీడాకారిణి, హైరాబాద్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా తొలిసారి స్పందించారు. తన జీవితాన్ని సమీక్షించుకుంటున్నట్టు వెల్లడించిన ఆమె.. అద్దంలో తనను తాను చూసుకుంటున్న ఫోటోను షేర్ చేసి రిఫ్లెక్ట్ అంటూ ఒకే ఒక పదాన్ని ట్యాగ్ చేశారు. తనను తాను సమీక్షించుకుంటున్నాననే అర్థం వచ్చేలా ఈ కామెంట్ పెట్టారు.అయితే, విడాకుల గురించి ఆమె ఎక్కడా ఎలాంటి ప్రస్తావన చేయలేదు. 
 
గత కొంతకాలంగా సానియా మీర్జా - షోయల్ మాలిక్ వివాహ బంధంపై సోషల్ మీడియాలో అనేక రకాలైన వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. వీటిని నిజం చేస్తూ షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు. పాకిస్థాన్ ప్రముఖ నటి సానా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ ఫోటోలను ఆయన షేర్ చేయడంత ఈ వివాహ బంధంపై వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. 
 
ఈ ఫోటోల తర్వాత సానియా కుటుంబం స్పందించింది. షోయబ్‌తో సానియా ఖులా చేసుకున్నారని తెలిపింది. సానియా మీర్జానే తనంతట తానుగా విడాకులు తీసుకున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో సానియా మీర్జా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఆమె తండ్రి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇపుడు సానియా మీర్జా రిఫ్లెక్ట్ అంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments