Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్‌కు భారత స్విమ్మర్ ప్రకాశ్ అర్హత.. రికార్డ్

Sajan Prakash
Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (08:37 IST)
sanjan prakash
భారత స్విమ్మర్‌ సజన్‌ ప్రకాశ్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించి..  చరిత్ర సృష్టించాడు. అర్హత 'ఎ' ప్రమాణం అందుకుని ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత తొలి స్విమ్మర్‌గా సజన్ ప్రకాశ్ రికార్డు సృష్టించాడు. రోమ్‌లో సెట్‌ కోలి ట్రోఫీలో జరిగిన 200 మీటర్ల బటర్‌ ఫ్లై విభాగంలో అతడు ఒక నిమిషం 56.38 సెకన్లలో రేసు ముగించాడు. ఒలింపిక్‌ అర్హత మార్క్‌ ఒక నిమిషం 56.48 సెకన్లు. అంత కంటే ముందే లక్ష్యాన్ని చేరుకున్నాడు.
 
ఈ క్రమంలో కేరళకు చెందిన సజన్ ప్రకాశ్.. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డునూ తిరగరాశాడు. గత వారం బెల్‌గ్రేడ్‌ ట్రోఫీ స్విమ్మింగ్‌ టోర్నీలో ఒక నిమిషం 56.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరి జాతీయ రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 27ఏళ్ల సజన్‌కిది వరుసగా రెండో ఒలింపిక్స్‌ కానుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో సజన్‌ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో ఓవరాల్‌గా 28వ స్థానంలో నిలిచాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

తర్వాతి కథనం
Show comments