Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా ఓపెన్‌లోనూ చేతులెత్తేసిన సైనా నెహ్వాల్.. పీవీ సింధు మాత్రం అదరగొట్టింది.. 

చైనా ఓపెన్‌లో హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మళ్లీ చేతులెత్తేసింది. ఈ ఏడాది టైటిల్స్ వేటలో వెనక్కి తగ్గిపోయిన సైనా నెహ్వాల్.. చైనా ఓపెన్లోనూ అదే తంతు కొనసాగించింది. అయితే ప్రతిష్టాత్మక ఒలింపిక

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (13:02 IST)
చైనా ఓపెన్‌లో హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మళ్లీ చేతులెత్తేసింది. ఈ ఏడాది టైటిల్స్ వేటలో వెనక్కి తగ్గిపోయిన సైనా నెహ్వాల్.. చైనా ఓపెన్లోనూ అదే తంతు కొనసాగించింది. అయితే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధు మాత్రం తన సత్తా ఏంటో నిరూపించుకుంది. చైనా ఓపెన్ తొలి రౌండ్లో పీవీ సింధు శుభారంభం చేయగా, తొలి రౌండ్లోనే సైనా నిరాశపరిచింది. 
 
మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సైనా మూడు నెలల తర్వాత చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీతో మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన తొలిరౌండ్లో సైనా తన థాయ్‌లాండ్ ప్రత్యర్థిపై పైచేయి సాధించలేకపోయింది. థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి పోర్న్‌టిప్‌ బురనప్రసేత్యుతో తలపడిన సైనా మెరుగైన షాట్లతో ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా 16-21, 21-19, 14-21 పాయింట్ల తేడాతో సైనా పరాజయం పాలైంది. 
 
అయితే పీవీ సింధు మాత్రం తన సత్తా చాటింది. చైనా ఓపెన్‌లో తొలి రౌండ్లో గెలుపును నమోదు చేసుకోవడం ద్వారా పీవీ సింధు రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి సిన్ లీతో తలపడిన సింధు... ఆద్యంతం మెరుగైన ఆటతీరుతో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. ఫలితంగా 21-12, 21-16తో కేవలం 34 నిమిషాల్లోనే విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

తర్వాతి కథనం