Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీకి చుక్కెదురు.. రియోలో సానియా సత్తా చాటుతుందా?

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జం

Webdunia
ఆదివారం, 31 జులై 2016 (11:00 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట పోరాటం ముగిసింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన ఈ ఇండో-స్విస్ ద్వయం శనివారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో 4-6, 3-6తో క్రిస్టినా మెక్‌హాలె-అసియా మొహమ్మద్ (అమెరికా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 
 
టాప్ సీడ్ జంట అయిన సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ రోజర్స్ కప్ మెరుగైన ఆటతీరు ప్రదర్శించినా ధీటుగా రాణించలేకపోయింది. దీంతో పరాజయం తప్పలేదు. ఇకపోతే.. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సానియా జోడీ మెరుగ్గా రాణించలేకపోవడం కాస్త అభిమానులను ఇబ్బందికి గురిచేసిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అయితే రియోలో తమ సత్తా చూపించేందుకు సానియా మీర్జా రోహన్ బోపన్న, తొంబరేలతో బరిలోకి దిగనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

Vamsika: పంజాబ్ భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద మృతి

Rayalaseema Express: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Telangana: లండన్‌లో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి

రూ.476 కోట్ల విలువైన విమానం నీటిపాలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

తర్వాతి కథనం
Show comments