Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోప్ పరీక్షల్లో పట్టుబడిన భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్

భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ కెరీర్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. నేషనల్‌ యాంటి డోపింగ్‌ ఏజన్సీ (నాడా) నిర్వహించిన టెస్ట్‌లో నిషేధిత స్టెరాయిడ్‌ వాడినట్టుగా తేలింది.

Webdunia
ఆదివారం, 24 జులై 2016 (12:34 IST)
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ కెరీర్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. నేషనల్‌ యాంటి డోపింగ్‌ ఏజన్సీ (నాడా) నిర్వహించిన టెస్ట్‌లో నిషేధిత స్టెరాయిడ్‌ వాడినట్టుగా తేలింది. ఫలితంగా డోప్‌ పరీక్షలో నర్సింగ్‌ యాదవ్‌ విఫలమయ్యాడు. దీంతో నిర్సింగ్‌ యాదవ్‌ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 
 
ఒలింపిక్స్‌ 74 కిలోల రెజ్లింగ్‌ విభాగంలో భారత రెజ్లర్‌ పోటీ పడాల్సి ఉంది. గత ఏడాది ప్రపంచ కుస్తీ పోటీల్లో నర్సింగ్‌ కాంస్యం సాధించి మెగా ఈవెంట్‌కు బెర్త్‌ సాధించాడు. స్టార్‌ రెజ్లర్‌ సుశీల్ కుమార్‌ను కాదని ఇండియన్ ఒలింపిక్‌ అసోసియేషన్ యంగ్‌ రెజ్లర్‌కు అవకాశం ఇచ్చిన విషయం తెల్సిందే. దీనిపై విమర్శలు చెలరేగినా.. భారత ఒలింపిక్ సంఘం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 

నర్సింగ్ సమక్షంలోనే ఎన్ఏడీఏ శాంపిల్ 'బి' టెస్టులు చేయగా, పూర్తి నివేదిక రాగానే నర్సింగ్ను రియో పంపాలా.. వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య ఇప్పటివరకూ నర్సింగ్ యాదవ్ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఆగస్టు 5 నుంచి 21 వరకు జరగనున్న రియో ఒలింపిక్స్ లో 74 కేజీల విభాగంలో భారత్ తరఫున నర్సింగ్ బరిలో దిగనున్న విషయం తెలిసిందే.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments