Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈరోజు నేనిక్కడ ఉన్నానంటే అందుకు కారణం కోచ్ గోపీచంద్ : పీవీ సింధు

ఈరోజు నేనిక్కడ ఉన్నానంటే అందుకు కారణం కోచ్ గోపీచంద్ కారణం అని రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు చెప్పుకొచ్చారు. అలాగే, ఈ ఒలింపిక్స్‌లో తాను సాధించిన వెండి పతకం కోచ్, తల్లిదండ్రులకు అంకితం ఇస్

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (17:30 IST)
ఈరోజు నేనిక్కడ ఉన్నానంటే అందుకు కారణం కోచ్ గోపీచంద్ కారణం అని రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు చెప్పుకొచ్చారు. అలాగే, ఈ ఒలింపిక్స్‌లో తాను సాధించిన వెండి పతకం కోచ్, తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం రాత్రి స్పెయిన్ క్రీడాకారిణి కరోలిన్ మరిన్‌తో ఫైనల్ మ్యాచ్ ముగిశాక సింధు మీడియాతో మాట్లాడింది.
 
ఒలింపిక్స్ కోసం నేను చాలా కష్టపడ్డాను. నాతో సమానంగా ఆయన కూడా శ్రమించారు. నా మెడల్‌ను కోచ్, నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను. నా మ్యాచ్‌లు ఆలస్యంగా జరిగినప్పటికీ ఒపిగ్గా వీక్షించిన వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరి అండదండలే నాకు ఆలంబనగా నిలిచాయని అన్నారు. 
 
అలాగే, ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఈ వారం నాకు చాలా అద్భుతంగా ఉంది. ఈ వారంలోనే వెండి పతకం సాధించాను. కరోలినా కూడా బాగా ఆడింది. ఫైనల్లో ఇద్దరం హోరాహోరీగా తలపడ్డాం. కానీ ఈరోజు ఆమె పైచేయి సాధించింది. మొత్తంగా చూస్తే చాలా మంచి గేమ్ ఆడాం. నాకు సిల్వర్ మెడల్ దక్కినా సంతోషంగానే ఉంది. నాకు మద్దతు తెలిపి, నా విజయం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

లేడీ డాక్టర్‌ను పెళ్ళి పేరుతో నమ్మించి హోటల్‌కు పిలుపు... కోరిక తీర్చుకున్నాక పెళ్లికి నిరాకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

తర్వాతి కథనం
Show comments