Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరియా సూప‌ర్‌ సిరీస్‌లో సింధు దూకుడు.. టైటిల్‌కు అడుగు దూరంలో...

కొరియా సూపర్ సిరీస్ టోర్నీరో భారత బ్యాడ్మింటన్ స్టార్ సింధు ఆధిపత్యం కొనసాగుతోంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సింధు విజయం సాధించి టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన మ్యాచ్‌

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (12:57 IST)
కొరియా సూపర్ సిరీస్ టోర్నీరో భారత బ్యాడ్మింటన్ స్టార్ సింధు ఆధిపత్యం కొనసాగుతోంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సింధు విజయం సాధించి టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ష‌ట్ల‌ర్ సింధు కొరియా ఓపెన్ సూప‌ర్‌సిరీస్ ఫైన‌ల్లో ప్ర‌వేశించింది. దీంతో ఆమెకు మ‌రో ప‌త‌కం ఖాయ‌మైంది. ఈ సెమీస్‌లో సింధు 21-10, 17-21, 21-16 స్కోర్‌తో బింగ్ జియావోపై విజ‌యం సాధించింది.
 
మొద‌టి గేమ్‌ను సింధు కేవ‌లం 16 నిమిషాల్లోనే సింధు సొంతం చేసుకున్న‌ది. చాలా జోరు మీదున్న సింధు సెమీస్ ఫ‌స్ట్ గేమ్‌లో అదే దూకుడును ప్ర‌ద‌ర్శించింది. స్మాష్ షాట్ల‌తో ఆక‌ట్టుకుంది. దీంతో ఫ‌స్ట్ గేమ్‌ను 21-10 తేడాతో గెలుచుకుంది. ఆ తర్వాత రెండో గేమ్‌ను 21-17 స్కోర్‌తో చేజిక్కించుకున్న‌ది. దీంతో డిసైడ‌ర్ గేమ్‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. 
 
చివరి గేమ్‌లో ఇద్ద‌రూ హోరా హోరీగా తలపడ్డారు. ఫ‌స్ట్ హాఫ్‌లో సింధు టాప్ గేమ్ ప్ర‌ద‌ర్శించినా.. చైనా ప్లేయ‌ర్ కూడా గ‌ట్టి పోటీ ఇచ్చింది. అయితే కీల‌క ద‌శ‌లో పాయింట్ల‌ను సొంతం చేసుకుంది. ఓ ద‌శ‌లో 306 కిలోమీట‌ర్ల వేగంతో ఓ స్మాష్ షాట్ కొట్టింది. దీంతో మూడో గేమ్‌ను 21-16 స్కోర్‌తో గెలిచి చ‌రిత్ర సృష్టించింది.
 
కాగా, కొరియా ఓపెన్‌సిరీస్‌లో భార‌త మ‌హిళా షట్ల‌ర్ ప్ర‌వేశించ‌డం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఫైన‌ల్లో జ‌పాన్ ప్లేయ‌ర్ నోజోమీ ఒకుహ‌రాతో సింధు ఢీకోనుంది. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో ఒకుహ‌రా చేతిలో ఓడిన సింధు ఫైన‌ల్లో ఆమెపై ప్ర‌తీకార విజ‌యం సాధించేందుకు సిద్ధమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఏపీ వాసుల దుర్మరణం

గుడ్ ఫ్రైడే : క్రైస్తవ పాస్టర్లకు శుభవార్త.. గౌరవ వేతనం రూ.30 కోట్లు విడుదల

భార్యల వివాహేతర సంబంధాలతో 34 రోజుల్లో 12 మంది భర్తలు హత్య, ఎక్కడ?

తితిదే ఈవో బంగ్లాలో దూరిన పాము - పట్టుకుని సంచెలో వేస్తుండగా కాటేసింది...

పెళ్లికి నిరాకరించిన ప్రేమించిన వ్యక్తి.. అతని ఇంటిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments