Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా బ్యాడ్మింటన్: పీవీ సింధు- అజయ్ జయరాం గెలుపు.. సైనా ఓటమి

ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ తొలి రౌండ్‌లో షట్లర్ పీవీ సింధు విజయం సాధించింది. కానీ మరో షట్లర్ సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు ఇండోనేషియా అన్‌సీడెడ్‌ క్రీడాకారిణ

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (16:55 IST)
ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ తొలి రౌండ్‌లో షట్లర్ పీవీ సింధు విజయం సాధించింది. కానీ మరో షట్లర్ సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు ఇండోనేషియా అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి దినార్‌ అయుస్టీన్‌పై 21-8, 21-18 తేడాతో గెలుపొందింది. తొలి సెట్‌ను సులభంగా గెలుచుకున్న సింధు రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటనను ఎదుర్కొంది. 
 
అయినప్పటికీ ప్రత్యర్థి షాట్లను ధీటుగా ఎదుర్కొన్న సింధు 31నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కానీ ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన భారత క్రీడాకారిణి సైనా తొలి రౌండ్లో జపాన్‌ క్రీడాకారిణి సయాక సాటో చేతిలో 21-19, 16-21, 18-21తేడాతో ఓడిపోయింది. తద్వారా ఈ టోర్నీ నుంచి సైనా నిష్క్రమించింది.
 
పురుషుల సింగిల్స్‌లో అజయ్‌ జయరాం 21-18, 18-21, 21-19తేడాతో చైనా క్రీడాకారుడు తియాన్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌కి దూసుకెళ్లాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ప్రణవ్‌-సిక్కిరెడ్డి జోడీ 15-21, 21-14, 16-21తేడాతో చైనా జోడీ జెంగ్‌-చెన్‌ చేతిలో పరాజయం పాలైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

కెనడా రాజకీయాల్లో సంచలనం - ఉప ప్రధాని క్రిస్టియా రాజీనామా

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

తర్వాతి కథనం
Show comments