Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడబిడ్డలు దేశానికి ఒలింపిక్ పతకాలు సాధించి పెట్టారు: నరేంద్ర మోడీ

రియో ఒలింపిక్స్‌లో ఆడబిడ్డలు దేశానికి ఒలింపిక్ పతకాలు సాధించి పెట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారత్‌కు రెండు పతకాలు సాధించిపెట్టిన తెలుగు తేజం పీవీ సింధు, సాక్షి మాలిక్‌ల ప్రతిభను ప్రధాని

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2016 (13:30 IST)
రియో ఒలింపిక్స్‌లో ఆడబిడ్డలు దేశానికి ఒలింపిక్ పతకాలు సాధించి పెట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారత్‌కు రెండు పతకాలు సాధించిపెట్టిన తెలుగు తేజం పీవీ సింధు, సాక్షి మాలిక్‌ల ప్రతిభను ప్రధాని నరేంద్ర మోడీ ఆకాశానికెత్తేశారు. ఆదివారం ఉదయం ఆలిండియా రేడియోలో నిర్వహించిన ‘మన్ కీ బాత్’లో క్రీడలను ప్రస్తావించిన మోడీ... సింధు, సాక్షిలతో పాటు దీపా కర్మాకర్, పుల్లెల గోపీచంద్‌లను ప్రధానంగా ప్రస్తావించారు. 
 
ఆడబిడ్డలు దేశానికి ఒలింపిక్ పతకాలు సాధించిపెట్టారని వ్యాఖ్యానించిన మోడీ... సింధు, సాక్షిల సత్తాను ఆకాశానికెత్తేశారు. మరింత ప్రోత్సాహమిస్తే మరిన్ని అద్భుత విజయాలను వారు సాధిస్తారని చెప్పారు. ఇక ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయినా దీపా కర్మాకర్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. కోచ్‌గా మెరుగైన క్రీడాకారులను తయారు చేస్తున్న బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్... దేశానికి ఒలింపిక్ పతాకాలు రాబట్టడంలో సఫలమయ్యారని మోడీ వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

తర్వాతి కథనం
Show comments