Webdunia - Bharat's app for daily news and videos

Install App

జకోవిచ్‌తో డేటింగ్ కోసం పరితపించిన దీపిక : ఈ మాట ఎవరన్నారు?

దీపికా పదుకొనే. బాలీవుడ్ స్టార్. ఇటీవల హాలీవుడ్ చిత్ర ప్రవేశం కూడా చేసింది. ట్రిపుల్ ఎక్స్ అనే చిత్రంలో హాట్‌హాట్‌గా నటించింది. అలాగే, నోవాక్ జకోవిచ్. అంతర్జాతీయ టాప్ టెన్నిస్ ప్లేయర్. ఈ సెర్బియా ఆటగా

Webdunia
సోమవారం, 10 జులై 2017 (14:32 IST)
దీపికా పదుకొనే. బాలీవుడ్ స్టార్. ఇటీవల హాలీవుడ్ చిత్ర ప్రవేశం కూడా చేసింది. ట్రిపుల్ ఎక్స్ అనే చిత్రంలో హాట్‌హాట్‌గా నటించింది. అలాగే, నోవాక్ జకోవిచ్. అంతర్జాతీయ టాప్ టెన్నిస్ ప్లేయర్. ఈ సెర్బియా ఆటగాడు.. తక్కువోడేం కాదు. పెళ్లికి ముందే పలువురు అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. అలా డేటింగ్ చేసిన అమ్మాల్లో ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. కానీ, అలాంటి జకోవిచ్‌పై బాలీవుడ్ సుందరాంగి దీపిక మనసుపడింది. అతనితో డేటింగ్ చేయాలని పరితపించిందట. ఇందుకోసం రెండుసార్లు ముమ్మరంగా ప్రయత్నించిందట. కానీ, ఆమె ప్రయత్నాలు ఫలించలేదట.
 
ఇదే అంశంపై జకోవిచ్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ న‌టాషా తాజాగా ఓ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీపికా ప‌దుకొనేకు జకోవిచ్‌తో డేటింగ్ చేయ‌డం ఇష్ట‌మ‌ని వెల్ల‌డించింది. ఈ కామెంట్‌తో పాటు రీసెంట్‌గా నొవాక్‌పై రిలీజ‌ైన ఓ వీడియో.. ఈ రెండు ఇప్పుడు నొవాక్ జ‌కోవిచ్ గ‌త చ‌రిత్ర‌ను తవ్వి తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. అయితే.. ఇంత‌వ‌ర‌కు ఈ కామెంట్స్‌పై నొవాక్ మాత్రం స్పందించ‌లేదు. 
 
కాగా, జకోవిచ్ తొలుత అంటే 2011 నుంచి 2014 వ‌ర‌కు పాప్‌స్టార్ న‌టాషా బెక్వ‌ల‌క్‌తో డేటింగ్ చేశాడు. ఆ స‌మ‌యంలోనే జెలెనా రిస్టిక్ అనే మ‌రో అమ్మాయితోనూ డేటింగ్ చేశాడు. పిమ్మట 2014లోనే జెలెనాను పెళ్లి చేసుకుని, న‌టాషాతో సంబంధాలు తెంచుకున్నాడు. ఈ క్రమంలో దీపికతో డేటింగ్‌కు ప్రయత్నించాడు. దీపికకు, జకోవిచ్‌లు 2014లో ఇంట‌ర్నేష‌నల్ ప్రీమియ‌ర్ టెన్నిస్ లీగ్ సందర్భంగా పరిచయం ఏర్పడింది. 
 
ఈ టోర్నీలో ఇద్ద‌రు క‌లిసి టెన్నిస్ డ‌బుల్స్ మ్యాచ్ ఆడారు కూడా. మళ్లీ రెండేళ్ల త‌ర్వాత అంటే గ‌త సంవ‌త్స‌రం మార్చిలో లాస్‌ఏంజెల్స్‌లో ఇద్ద‌రు క‌లుసుకున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి. మొత్తంమీద వీరిద్దరి మధ్య ఏదో వ్యవహారం ఉందని విదేశీ పత్రికలు కోడైకూశాయి కూడా. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉపాధ్యాయుడికి చెప్పు దెబ్బలతో దేహశుద్ధి... (Video)

సముద్రపు తాబేలు కూర తిని ముగ్గురి మృతి, 30 మందికి పైగా అస్వస్థత

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. పడ్డాడో అంతే సంగతులు? (వీడియో)

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. స్టెల్లా షిప్‌ను సీజ్‌ చేసిన అధికారులు

ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్‌పై తప్పుడు నివేదిక : డాక్టర్ ప్రభావతి అరెస్టు తప్పదా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

'పుష్ప-2' చిత్రం రిలీజ్ వాయిదానా?

'పుష్ప-2' ఎన్ని దేశాల్లో విడుదలవుతుందో తెలుసా?

విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత

థ్రిల్ కలిగించే UI ది మూవీ వార్నర్ రిలీజ్ : ఉపేంద్ర

తర్వాతి కథనం
Show comments