Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా ఓపెన్ : 9వ టైటిల్‌ను కైవసం చేసుకున్న నొవాక్ జకోవిచ్

Webdunia
ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (16:52 IST)
ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ చాంపియన్ షిప్ టైటిల్‌ను మరోమారు టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ కైవసం చేసుకుంది. ఈ టైటిల్‌ను ఆయన గెలుచుకోవడం ఇది తొమ్మిదోసారి కావడం గమనార్హం. 
 
మెల్బోర్న్‌ వేదికగా ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సెర్బియా క్రీడాకారుడు జకోవిచ్ వరుస సెట్లలో డానిల్ మెద్వెదెవ్‌ను మట్టికరిపించాడు. 7-5, 6-2, 6-2తో ప్రత్యర్థిని చిత్తుచేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారుడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. 
 
కాగా, అద్భుత ఆటతీరుతో ఫైనల్ వరకు దూసుకొచ్చిన పాతికేళ్ల రష్యా కుర్రాడు మెద్వెదెవ్ టైటిల్ సమరంలో జకోవిచ్ అనుభవం ముందు నిలవలేకపోయాడు. తొలి సెట్లో మాత్రం కాస్త గట్టిపోటీ ఇచ్చినట్టు కనిపించిన మెద్వెదెవ్ చివరి రెండు సెట్లలో తేలిపోయాడు. 
 
బలమైన సర్వీసులు, పదునైన ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో విజృంభించిన జకోవిచ్ ను అడ్డుకోలేకపోయాడు. ఈ విజయంతో జకోవిచ్ కు ట్రోఫీతో పాటు రూ.15 కోట్ల వరకు నగదు బహుమతి అందుకోనున్నాడు. 
 
ఓవరాల్‌గా ఇది జకోవిచ్‌‌కు కెరీర్‌లో 18వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఓవరాల్ గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విషయంలో స్విస్ వీరుడు రోజర్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్... జకోవిచ్ కంటే ఓ మెట్టుపైన ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు చెరో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నారు. మరో రెండు గ్రాండ్ స్లామ్స్ గెలిస్తే జకోవిచ్ కూడా ఫెదరర్, నడాల్‌ల సరసన చేరతాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

Monsoon session: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

తర్వాతి కథనం
Show comments