Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ కోరల నుంచి తప్పించుకున్న నోవాక్ జకోవిచ్ దంపతులు..

Webdunia
గురువారం, 2 జులై 2020 (18:06 IST)
కోవిడ్ వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. సామాన్య ప్రజలతో పాటు ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా వరల్డ్ నెంబర్ వన్, సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ కరోనా బారినపడ్డారు. జకోవిచ్‌తో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. 
 
ఈ విషయాన్ని స్వయంగా జకోవిచే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ వుండనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నోవాక్ జకోవిచ్‌, ఆయన భార్య కరోనాను జయించారు. కరోనా కోరల నుంచి  బయటపడ్డారు. తాజాగా చేసిన కరోనా పరీక్షలో వారికి నెగెటివ్ వచ్చినట్లు జకోవిచ్ బృందం స్థానిక మీడియాకు తెలిపారు. 
 
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో సెర్బియా, క్రొయేషియాలో నిర్వహించిన ఎగ్జిబిషన్ సిరీస్‌లో ఆడిన తరువాత జకోవిచ్‌తో సహా మరో ముగ్గురు ఆటగాళ్లకు, జకోవిచ్ కోచ్‌ గోరన్ ఇవానిసెవిక్ కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత జకోవిచ్ నుండి అతని భార్య జెలెనా రిస్టిక్‌‌కు కూడా ఈ వైరస్ సోకింది. 
 
అయితే కరోనా పాజిటివ్ పరీక్షించినప్పటి నుండి సెర్బియాలో ఇద్దరు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇక తాజాగా బెల్గ్రేడ్‌లో ఇద్దరికి జరిగిన కరోనా పరీక్షల ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో జకోవిచ్ ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య

రాహుల్ - ఖర్గేల కోసం జైలు ఎదురు చూస్తోంది...: అస్సాం సీఎం

తెలంగాణలో ఈగిల్ టీమ్ అదుర్స్.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేస్తారా? తాట తీస్తాం..

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments