Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బెడ్రూం ఏం జరుగుతుందో మీకు చెప్పాలా : సానియా మీర్జా

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (11:14 IST)
నా పడక గదిలో రాత్రి పూట ఏం జరుగుతుందో మీకు చెప్పాలా అంటూ భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ప్రశ్నించారు. బీబీసీ చానెల్‌కు ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమెకు ఆ చానెల్ ప్రతినిధి నుంచి ఓ వింతైన ప్రశ్న ఎదురైంది. దీనికి సానియా మీర్జా ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
వివాహమై ఐదేళ్లు దాటిపోతున్నా, పిల్లలు లేరుగా? అనే ప్రశ్న బీబీసీ ప్రతినిధి సంధించారు. దీనిపై సానియా మీర్జా ఘాటుగానే స్పందించారు. 'నా బెడ్ రూంలో ఏం జరుగుతుందో అడిగే హక్కు ఎవరికీ లేదు' అంటూ ఆమె బీబీసీ ప్రజెంటర్ కు ఘాటుగా సమాధానం చెప్పారు. 
 
కాగా, 2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో సానియా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సానియాతో పాటు షోయబ్ కూడా క్రీడా జీవితంలో బిజీబిజీగానే ఉన్నారు. ఈ క్రమంలో తల్లి ఎప్పుడు అవుతారంటూ సానియాకు పలు సందర్భాల్లో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ తరహా ప్రశ్నలపై మొన్నటిదాకా కాస్తంత సావధానంగానే సమాధానాలు చెప్పిన సానియా తాజాగా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. 

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments