Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్ట్‌లో భార్యను ఉతికేసిన రే రైస్ : అమెరికాలో సంచలనం..వీడియో

Webdunia
బుధవారం, 30 జులై 2014 (16:16 IST)
అమెరికాలోని మహిళా సంఘాలు సాకర్ ప్లేయర్‌‌ రే రైస్‌పై మండిపడుతున్నాయి. ఇంతకీ విషయమేమిటంటే.. స్టార్ ప్లేయర్ అయిన రే రైస్ ((Ray Rice) బాల్టిమోర్ రావెన్స్‌ (Baltimore Ravens) అనే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల తన గర్ల్ ఫ్రెండ్ జనే పాల్మర్ (Janay Palmer)తో కలిసి క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ బాగా తప్ప తాగి లిఫ్ట్‌లో వెళ్తూ లవర్‌తో ఏదో వాగాడు. అందుకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఝలక్ ఇవ్వడంతో ఆమె ముఖంలో ఉమ్మేశాడు. 
 
అంతేకాకుండా.. చెంపచెల్లుమనిపించాడు. ఇంతేకాకుండా ఆవేశంతో ఊగిపోయాడు. ఆమెను కిందకు నెట్టి కొట్టేశాడు. ఈ తతంగమంతా లిఫ్ట్‌లోని కెమెరాలో రిజిస్టర్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరి వద్ద విచారణ జరిపారు. అక్కడ ఏం జరగనట్లు వాళ్లిద్దరూ వెళ్లిపోవడంతో కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత ఈ లవర్స్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.  
 
అయితే లిఫ్ట్ సంగతి కెమెరా ద్వారా మీడియా హంగామా చేయడంతో అమెరికా మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. భార్యను ఆవిధంగా చితకబాదడంతో రేస్‌ను శిక్షించాలని డిమాండ్ చేశాయి. కానీ కేసు నమోదు కాకపోవడంతో నేషనల్ ఫుట్ బాల్ లీగ్ ఆతనిని రెండు మ్యాచ్‌లు సస్పెండ్ చేసింది. అంతేగాకుండా రేస్ భార్య వద్ద క్షమాపణలు కోరాడు. 
 
కానీ అమెరికా మహిళా సంఘాలు ఇంకా చల్లారలేదు. రెండు మ్యాచ్‌ల సస్పెండ్, భార్యవద్ద క్షమాపణలు కోరితే సరిపోదని.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments