Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా ఎందుకు చనిపోయారో తెలుసా?

ఠాగూర్
శుక్రవారం, 28 మార్చి 2025 (11:01 IST)
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగీ మారడోనా చనిపోయి నాలుగున్నరేళ్ళ సమయం గడిచిపోయింది. ఇపుడు ఆయన ఎందుకు చనిపోయారన్న విషయం వెలుగులోకి వచ్చింది. మారడోనా మానసిక వేదనతో మరణించివుంటానని పోస్టుమార్టం నివేదికలో ఓ నిపుణుడు పేర్కొన్నాడు. మారడోనా మృతి నేపథ్యంలో ఏడుగురు వైద్యు నిపుణులు హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ నిపుడు డాక్టర్ మౌరిసియో కాసినెల్లి విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు. గుండె వైఫల్యం, కాలేయ సిరోసిస్ కారణంగా మారడోనా మరణానికి ముందు కనీసం పది రోజులు ఆయన ఊపిరితిత్తుల్లోని నీరు పేరుకుపోయిందని పేర్కొన్నారు. మారడోనా బాగోగులు చూసుకునే నర్సులు, వైద్యులు ఈ విషయాన్ని గమనించి ఉండాలని న్యాయమూర్తులకు తెలిపారు. 
 
మారడోనా గుండె సాధారణం కంటే రెండింతలు బరువు ఉంటుందని, డాక్టర్ మౌరిసియో పేర్కొన్నారు. మరణానికి కనీసం 12 గంటల ముందు ఆయన వేదన అనుభవించివుంటారని వివారించారు. మెదడులో రక్తం గడ్డకట్టుకునిపోవడంతో చేసిన ఆపరేషన్ నుంచి కోలుకున్న మారడోనా.. కొన్ని దశాబ్దాలపాటు కొకైన్, ఆల్కహాల్ వ్యసనంతో బాధపడ్డారని తెలిపారు. 
 
మారడోనా చివరి రోజుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఏడుగురు వైద్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఆరోపణలు నిజమని తేలితే వారికి 8 నుంచి 25 ఏళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మారడోనా గుండే ఆగిపోవడం ఉపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోయే పరిస్థితి కారణంగా మరణించినట్టు వైద్యులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

తర్వాతి కథనం
Show comments