Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి ఫుట్‌బాల్ అంటే ఎంతిష్టం.. దఢక్ హీరోతో ఆడేశాడు..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫుట్‌బాల్ చాలా ఇష్టం. క్రికెట్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే ధోనీ ఫుట్‌బాల్ స్టేడియంలో కనిపిస్తాడు. తాజాగా ఇంగ్లాండ్‌లో టీ20, వన్డే సిరీస్ ముగియడంతో స్వదేశాన

Webdunia
గురువారం, 26 జులై 2018 (16:12 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫుట్‌బాల్ చాలా ఇష్టం. క్రికెట్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే ధోనీ ఫుట్‌బాల్ స్టేడియంలో కనిపిస్తాడు. తాజాగా ఇంగ్లాండ్‌లో టీ20, వన్డే సిరీస్ ముగియడంతో స్వదేశానికి తిరిగొచ్చిన ధోనీ, ఇటీవలే రిలీజైన ధడక్ సినిమా హీరో ఇషాన్ ఖట్టర్‌తో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు. 
 
ముంబైలో జరిగిన ఓ ఛారిటీ మ్యాచ్‌లో బంతాట ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడికి ఫుట్ బాల్ టిప్స్ నేర్పించాడు. ఈ మ్యాచ్‌లో ధడక్ సినిమా డైరెక్టర్ శశాంక్ ఖేతాన్ కూడా ఆడాడు. 
 
ఇకపోతే, క్రికెట్‌లోకి రాకముందు ధోనీ తన స్కూల్ ఫుట్‌బాల్ టీమ్‌లో గోల్ కీపర్‌గా ఆడేవాడు. కోచ్ బలవంతం కొద్దీ క్రికెటర్ అయ్యాడు. కానీ లేకపోతే సాకర్‌లో సూపర్ స్టార్ అయ్యేవాడని క్రీడా పండితులు అంటున్నారు. ఇండియన్ సూపర్ లీగ్‌లో ఆడే చెన్నై ఎఫ్‌సీ‌టీమ్‌కి ధోనీ సహ యజమాని. దీనిని బట్టి ధోనీకి ఫుట్‌బాల్ ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చునని క్రీడా పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments