Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డు.. అతి చిన్న వయస్కురాలిగా సింధూ రికార్డ్.. ధోనీ, కోహ్లీలకు కూడా?

రియో ఒలింపిక్స్‌లో భారత జెండాకు గౌరవాన్ని సంపాదించిపెట్టిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ అవార్డును అందుకున్న అతి చిన్న వయస్కురాలిగా సింధూ రికార్డును

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (15:50 IST)
రియో ఒలింపిక్స్‌లో భారత జెండాకు గౌరవాన్ని సంపాదించిపెట్టిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ అవార్డును అందుకున్న అతి చిన్న వయస్కురాలిగా సింధూ రికార్డును సృష్టించింది. గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించడం ద్వారా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు కొట్టేసిన పీవీ సింధు.. సెలెబ్రిటీల సరసన చేరిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో పద్మభూషణ్ అవార్డుకు ఆమె పేరు కూడా చేరింది. 
 
ఇకపోతే.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీకి కూడా పద్మ భూషణ్ అవార్డు లభించింది. వీరితో పాటు విశ్వమోహన్ భట్, సాక్షీ మాలిక్, పుల్లెల గోపీచంద్, బాలీవుడ్ ఆశా పారేఖ్, నేపథ్య గాయకులు కైలాష్ ఖేర్, నటుడు మనోజ్ బాజ్ పేయి, నృత్య కళాకారిణి లక్ష్మీ విశ్వనాథన్, రంగస్థల నటుడు బసంతి బిస్త్, కథకళి నృత్యకారుడు సీకే నాయర్‌, శంకర్ మహదేవన్, సోనూ నిగమ్, బాలీవుడ్ వెటరన్ నటుడు రిషి కపూర్‌లకూ పద్మభూషణ్ అవార్డులు లభించాయి. ఇక పద్మశ్రీ అవార్డులకు క్రీడారంగంలో విరాట్ కోహ్లీ, దీపా మాలిక్, దీపా కర్మాకర్, వికాస్ గౌడ, పీఆర్ శ్రీజేష్‌లకు లభించాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సుప్రీంకోర్టు జడ్జీలకు చేదు అనుభవం... విమానంలో మందుబాబుల వీరంగం

'పప్పుగాడు' అనే మాట అనలేదు.. జగన్ అంటే అభిమానం: రామ్ గోపాల్ వర్మ (video)

చెన్నైకు 480 కిమీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్షాలు

అయ్యప్పమాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ (Video)

లోక్‌సభ సభ్యురాలిగా ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

తర్వాతి కథనం
Show comments